Athiya Shetty: పెళ్లికి సిద్ధమయిన మరో బాలీవుడ్ ప్రేమజంట.. పనులు మొదలు..

Athiya Shetty: బాలీవుడ్‌లో మరో ప్రేమజంట పెళ్లి పీటలెక్కనుంది. గత కొంతకాలంగా ఓవైపు బాలీవుడ్‌లో, మరోవైపు క్రికెట్‌లో ప్రేమ వివాహాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. హీరోయిన్ అనుష్క శర్మను పెళ్లి చేసుకున్నాడు క్రికెటర్ విరాట్ కోహ్లీ. అప్పటినుండి వీరిద్దరు అటు బాలీవుడ్‌లో, ఇటు క్రికెట్ వరల్డ్‌లో క్యూట్ కపుల్‌గా కొనసాగుతున్నారు. తాజాగా అలాంటి మరో జంట పెళ్లికి సిద్ధమవుతున్నట్టు సమాచారం.
ఎంతోకాలంగా క్రికెటర్ కేఎల్ రాహుల్‌తో రిలేషన్‌షిప్‌లో ఉంది బాలీవుడ్ బ్యూటీ అతియా శెట్టి. వీరిద్దరూ ఓపెన్‌గా రిలేషన్‌షిప్‌లో ఉన్నా కూడా దీని గురించి ఓపెన్‌గా మాత్రం ఎప్పుడూ పెద్దగా మాట్లాడలేదు. ఇక పెళ్లి విషయం వస్తే.. అతియా శెట్టి.. అది మా పర్సనల్ విషయం అంటూ సోషల్ మీడియాపై ఫైర్ అయ్యేది. కానీ ఈసారి వారి పెళ్లిపై వస్తున్న రూమర్స్ దాదాపు నిజమే అని అతియా సన్నిహితులు చెప్తున్నారు.
కేఎల్ రాహుల్, అతియా శెట్టి పెళ్లి గురించి మాట్లాడడం కోసం రాహుల్ తల్లిదండ్రులు అతియా తండ్రి సునీల్ శెట్టిని కలిశారట. అంతే కాకుండా పెళ్లి తర్వాత ఈ జంట ఉండబోయే ఇంటిని కూడా ఇరు కుటుంబాలు పరిశీలించాయని సమాచారం.
రాహుల్, అతియా పెళ్లి ఏర్పాట్లు మొత్తం కొత్త ఇంట్లోనే చేయాలని వారు నిర్ణయించారట. ఇటీవల రాహుల్ అంటే తనకు చాలా ఇష్టమని, అతియా, తను పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు సునీల్ శెట్టి. మరి వీరి పెళ్లి గురించి ఆయన ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారో చూడాలి. కానీ అప్పుడే మరో మూడు నెలల్లో రాహుల్, అతియా పెళ్లి ఉండనునందని బాలీవుడ్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.a
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com