Bawaal Trailer : యూత్ ని ఆకర్షిస్తున్న 'బవాల్'
బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్, వరుణ్ ధవన్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం బవాల్. రొమాంటిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నితేశ్ తివారి దర్శకుడు. జూలై 21న నేరుగా ఓటీడీ నా ఫ్యామిలీలో విడుదల కాబోతున్న ఈ చిత్ర ట్రైలర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలిచింది. ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే ఐదు మిలియన్ పైగా వ్యూస్ దక్కించుకుంది.
టీచింగ్ ప్రొఫెషన్‌లో ఉన్న అజ్జు జీవితంలోకి ఎంట్రీ ఇస్తుంది నిషా. ఇద్దరి ప్రేమ పెళ్ళికి దారి తీస్తుంది. హనీమున్ కి భార్యను యూరప్ ట్రిప్‌కు తీసుకెళ్తాడు హీరో. ఆ ట్రిప్‌లో జాన్వీకపూర్, వరుణ్ ధావన్ మధ్య ఎలాంటి వార్ జరిగింది. రెండో ప్రపంచయుద్ధానికి, వీరి బంధానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఆనందంగా మొదలైన వారి ప్రయాణం ఎన్ని మలుపులు తీసుకుంది అనేది సినిమా చూస్తేనే తెలుసుకోవచ్చు. ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది.
దంగల్,చిఛోరే వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన నితేశ్ తివారి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రంలో మనోజ్ పహ్వా, ముఖేశ్ తివారి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని నదియావాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్, ఎర్త్‌స్కై పిక్చర్స్‌పై తెరకెక్కిస్తున్నారు. ఇక జాన్వీవిషయానికి వస్తే ఆమె ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ సరసన దేవర సినిమా చేస్తుంది. ఇది వచ్చే సంవత్సరం రిలీజ్ కానుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com