Bikini Row: థియేటర్లలో మెరిసిన కాషాయం బికినీ

ఎట్టకేలకు పఠాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. హైవోల్టేజ్ యాక్షన్ డ్రామా మంచి టాక్ సంపాదించుకుని బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో బేషరమ్ పాటలోని బికినీపై జరిగిన రచ్చ కూడా క్రమంగా సద్దుమణిగినట్లే కనిపిస్తోంది. బేషరమ్ రంగ్ పాటసహా, సినిమా మొత్తాన్ని బ్యాన్ చేయాల్సిందిగా జాతీయ స్థాయిలో సంప్రదాయవాదులు నినదించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సెన్సార్ బోర్డ్ సైతం పాటకు కొన్ని కత్తెర్లు వేసింది. దీంతో దీపిక కాషాయం బికినీని మొత్తానికి కట్ చేసిఉండవచ్చని భావించారు. కానీ, థియేటర్లకు వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. పఠాన్ రిలీజ్ సమయానికి దేశవ్యాప్తంగా పలు చోట్లు మోస్తరు అల్లర్లు జరిగినప్పటికీ సినిమా విజయవంతంగా ప్రదర్శితమైంది. ముఖ్యంగా బేషరమ్ సాంగ్ లో దీపిక బికనీ సీక్వెన్స్ యధాతథంగా ఉండటంతో అభిమానులు పండగ చేసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com