Bollywood: కియారా, సిడ్ షాపింగ్ సందడి; పెళ్లి ముచ్చట చెప్పేయబోతున్నారా!

Mumbai
Bollywood: కియారా, సిడ్ షాపింగ్ సందడి; పెళ్లి ముచ్చట చెప్పేయబోతున్నారా!
సెలబ్రిటీ డిజైనర్ తో సిడ్, కియారా మంతనాలు; పెళ్లి దుస్తుల కోసమేనంటూ నెటిజెన్స్ గగ్గోలు; నోరువిప్పని జంట

Bollywood: కియారా, సిడ్ షాపింగ్ సందడి; పెళ్లి ముచ్చట చెప్పేయబోతున్నారా!


కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా పెళ్లి వార్తలు కొంతకాలంగా మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా డేటింగ్ లో ఉన్న వీరు పెళ్లికి రెడీ అవుతున్నారంటూ ఇప్పటికే పలుమార్లు వినిపించింది. అయితే కాఫీ విత్ కరణ్ షోలో ఈ మేరకు కియారా హింట్ కూడా ఇచ్చేయడంతో వీరి పెళ్ళి ఎప్పుడెప్పుడాని అభిమానులు ఎదురుచూస్తున్నారు.


అయితే ఈ చూడముచ్చటైన జంట తమ బంధాన్ని మరో మెట్టు పైకి ఎక్కించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఈ బ్యూటిఫుల్ కపుల్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అయిన మనీష్ మల్హోత్రా స్టూడియో నుంచి బయటకు రావడం కెమెరా కంట పడింది. దీంతో ఈ జంట మనీష్ ఇంటికి ఎందుకు వెళ్ళారు అన్న అంశం తెరపైకి వచ్చింది.


బాలీవుడ్ సెలబ్రిటీల పెళ్లిళ్లకు మనీష్ మల్హోత్రా దుస్తులు డిజైన్ చేస్తాడన్న సంగతి తెలిసిందే. అయితే సిడ్, కియారా కూడా అందుకోసమే మనీష్ ను కలిశారా అని చెవులు కొరుక్కుంటున్నారు బీ టౌన్ వాసులు. ఏమైనా కళ్యాణ ఘడియలు వస్తే ఎవ్వరూ ఆపలేరు అన్నట్లు, న్యూ ఇయర్ లో ఈ జంట తప్పకుండా పెళ్లి శుభవార్త చెప్పడం ఖాయం అని పలువురు ఫిక్స్ అయ్యిపోయారు. మరి దీనిపై ఈ కొత్త జంట ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.


Tags

Read MoreRead Less
Next Story