Bollywood: ఖాన్స్ అపూర్వ కలయిక

Mumbai
Bollywood: ఖాన్స్ అపూర్వ కలయిక
సల్మాన్ ఖాన్ బర్త్ డే పార్టీకి విచ్చేసిన షారుఖ్; ఉబ్బితబ్బిబవుతున్న ఫ్యాన్స్

Bollywood: ఖాన్స్ అపూర్వ కలయిక


ఇంచుమించు ఒకేసారి కెరీర్ మొదలుపెట్టి, కలసి ఎన్నో సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకుని మంచి స్నేహితులుగా పేరుగాంచిన బాలీవుడ్ బడా ఖాన్స్ మధ్య దశాబ్దికాలం పాటూ సాగిన కోల్డ్ వార్ క్రమంగా కరిగిపోయిన సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా ఫార్మల్ ఫ్రెండ్స్ లా మాత్రమే కొనసాగుతున్న షారుఖ్, సల్మాన్ తాజాగా తమ మధ్య అడ్డుగా ఉన్న చిన్న ఈగో తెరను సైతం తొలగించేశారు.


సల్మాన్ పుట్టినరోజు పురస్కరించుకుని అతడు ఏర్పాటు చేసిన బర్త్ డే పార్టీకి హాజరయ్యాడు షారుఖ్. తన ఆహ్వానాన్ని మన్నించి రాకరాక విచ్చేసిన విశేష అతిథికి దగ్గరుండి స్వాగతం పలికాడు సల్మాన్ ఖాన్. ఒకరినొకరు చూసుకుంటూ వారిద్దరూ ఆలింగనం చేసుకున్న విధానాన్ని చూసి ఫ్యాన్స్ ఎమోషనల్ అయ్యారంటే వారి కెమిస్ట్రీ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

బ్లాక్ అండ్ బ్లాక్ లో మ్యూచింగ్ అవుట్ ఫిట్స్ ధరించిన ఖాన్స్ ఒకరికి మించి మరొకరు సూపర్ హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. ఇక వీరి కలయిక పై నెటిజెన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇది అత్యంత అమూల్యమైన స్నేహ బంధం అని ఒకరు కామెంట్ చేస్తే, వారిరువురూ ఎప్పుడూ ఇలానే కలసి మెలసి ఉండాలని మరికొందరు ఆశిస్తున్నారు. మరి ఇదే ఊపులో ఇరువురు ఖాన్స్ కలసి సిల్వర్ స్క్రీన్ పై సందడి చేస్తారేమో చూడాలి.



Tags

Read MoreRead Less
Next Story