Bollywood: ఘనంగా సల్మాన్ బర్త్‌ డే పార్టీ.. కనిపించని కంగనా.. అసలు విషయం అదే మరి..

Bollywood: ఘనంగా సల్మాన్ బర్త్‌ డే పార్టీ.. కనిపించని కంగనా.. అసలు విషయం అదే మరి..
X
సల్మాన్ పార్టీకి రాని కంగనా; వారి మధ్య విభేదాలు నిజమేనా!! పరేషాన్ అవుతున్న ఫ్యాన్స్..

Bollywood: ఘనంగా సల్మాన్ బర్త్‌ డే పార్టీ.. కనిపించని కంగనా.. అసలు విషయం అదే మరి..

బాలీవుడ్‌ కండల వీరుడైన సల్మాన్ ఖాన్ పుట్టిర రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. 57వ వసంతంలోకి అడుగుపెడుతున్న భాయ్ జాన్ బర్త్‌ డే పార్టీని అతడి సోదరి అర్పితా ఖాన్‌ నివాసంలో గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసింది. ఈ వేడుకకు బాలీవుడ్‌ బాద్‌ షా- షారుక్‌ ఖాన్‌, జాన్వీకపూర్‌, పూజా హెగ్డే, టబు, సునీల్ శెట్టి, రితేశ్- జెనీలియా, సోనాక్షి సిన్హా, కార్తీక్‌ఆర్యన్‌తో పాటుగా.. కొంతమంది సెలబ్రిటీలు హాజరు అయ్యారు. ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్లో చక్కర్లు కొడుతున్నాయి.

ఇంతవరకు బాగానే ఉంది. పార్టీకి అందరూ వచ్చారు కానీ, బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ఈ వేడుకలో కనిపించలేదు. ఇరువురూ ఎంత మంచి స్నేహితులో అందరికీ తెలిసింది. అసలు పెద్దగా పార్టీలకు హాజరుకాని కంగనా, సల్మాన్ పిలిస్తే మాత్రం అసలు మిస్‌ కాదు. అలాంటిది ఈసారి మిస్ అయింది. ఇందుకు కారణం సల్మాన్‌ కంగనాను పిలవడం మర్చిపోయాడంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

నార్మల్‌ పర్సన్‌ ని ఇన్‌ వైట్‌ చెయ్యడం మర్చిపోతే హడావిడిలో మర్చిపోయారంటే అర్థం ఉంటుంది. కానీ ఇపార్టెంట్‌ పర్స్‌ని మర్చిపోతే? దాని వెనుక ఎదో పెద్ద విషయమే ఉంటుంది అంటూ పలువురు రకరకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు. అసలు విషయానికి వస్తే, కంగనా బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలు చేస్తున్నప్పటికీ తనకు సరైన హిట్‌ మాత్రం దక్కడంలేదు. దీంతో ఈ అమ్మడు తన నెక్ట్ మూవీ పై ఫుల్ ఫోకస్‌ పెట్టిందట.

ఈసారి ఎలాగైనా హిట్‌ కొట్టాలని కంగనా తెగ కష్టపడుతుందట. షూటింగ్‌ కోసం వేరే ప్రాంతానికి వెళ్ళడంతో, సల్మాన్‌ పార్టీకి అటెండ్‌ కాలేదని తెలుస్తోంది. అంతేకాకుండా సల్లాబాయ్‌ కూడా కంగనాని ప్రత్యేకంగా ఆహ్వానించాడట. నిజానికి సల్మాన్‌ పిలిచిన చాలా మందిలో, కొందరు తమ షెడ్యూల్స్‌ కారణంగా పార్టీకి అటెండ్‌ కాలేకపోయారని బీ టౌన్ లో వార్తలు వినిపిస్తున్నాయి. సో కంగనా రనౌత్‌ కూడా తన ప్రాజక్ట్‌ కారణంగానే సల్మాన్‌ బర్త్‌ డే పార్టీకి రాలేకపోయిందని, అంతేకాని వారి మధ్య ఎలాంటి విభేధాలూ లేవని తెలుస్తోంది.

Tags

Next Story