Bollywood : లండన్ లో ఎక్స్ లవర్స్; కలసి పార్టీ చేసుకుంటున్నారంటోన్న నెటిజెన్లు...

బాలీవుడ్‌లో హీరో కార్తిక్ ఆర్యన్-సారా అలీఖాన్ ప్రేమలో పడ్డారని ఆ మధ్య తెగ వార్తలు వచ్చాయి. ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన 'లవ్ ఆజ్ కల్'లో వీరిద్దరూ కలిసి జంటగా నటించారు. అప్పట్లో వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ఇండస్ట్రీలో కోడై కూసింది. కానీ, కొంతకాలానికే ఇరువురూ బ్రేక్ అప్ చేప్పేసుకున్నారన్న ముచ్చట కూడా వినబడింది. తాజాగా ఈ జంట మరోసారి చట్టాపట్టేలేస్తోందని వినికిడి. కార్తీక్- సారా లండన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
కార్తీక్ ఆర్యన్, లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతూ న్య ఇయర్ వేడుకలు ఘనంగా జరుపుకున్నాడు. సరిగ్గా ఇదే సమయంలో సారా అలీ ఖాన్ కూడా అదే లొకేషన్‌లో హాలిడేస్ చేసుకుంటూ ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నిజానికి కార్తీక్, సారా లండన్‌లో విడివిడిగా సెలవులను ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు కారణం లేకపోలేదు సారా తన సోదరుడు ఇబ్రహీం అలీ ఖాన్ తోపాటు, లండన్‌కు చెందిన స్నేహితులతో దిగిన ఫోటోలను పోస్ట్ చేయగా, అటు కార్తీక్ ఆర్యన్ తాను సింగల్ గా ఎంజాయ్ చేస్తూ పలు ఫోటోలను పోస్టు చేశాడు. దీంతో వీరిద్దరూ కలసి న్యూ ఇయర్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నారేమో అన్న అనుమానం కలిగింంది.
ఇదివరకే ఇద్దరూ ప్రేమలో ఉండగా పలుసందర్భాల్లో కలసి దిగిన ఫోటోలను ఫ్యాన్స్ తో పంచుకున్నారు. అంతేకాకుండా వీరిరువురూ కలిసి ఎన్నో వెకేషన్స్ కి కూడా వెళ్ళారు. ఆ మధ్య వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో విడిపోయారంటూ ఓ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొట్టింది. మరి తిరిగి ఇద్దరూ ప్యాచ్ అప్ చేసుకున్నట్లే కనిపిస్తోంది. అందులో ఎంత నిజముందో వారికే తెలియాలి మరి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com