Bollywood: టాలీవుడ్ లో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్...! యంగ్ టైగర్ తో....

తన నటనతో అందర్నీ ఆశ్చర్యపరిచే అమీర్‌ఖాన్ సినిమాలకు కొంతకాలం బ్రేక్ ఇవ్వనున్నారన్న సంగతి తెలిసిందే. కొత్త సంవత్సరంలో సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీతో వీలైనంత ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలోనే తన వద్దకు వచ్చిన కథలను పర్యవేక్షిస్తున్నారు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. ఈ టాలెంటెడ్ యాక్టర్ తో సినిమా తీయాలని ప్రశాంత్ నీల్ తెగ ఆరాట పడుతున్నాడు. ఇందుకోసం ఓ కథను కూడా రాశేసాడట. పురుషాహంకారమే ఇతివృత్తంగా సిద్ధం చేసుకున్న కథతో అమీర్ కు ఓ జబర్దస్త్ రోల్ ఉండోతోందని తెలుస్తోంది. ఇక మరో లీడ్ గా జూ.ఎన్టీఆర్ అయితే బాగుంటుందని అనుకుంటున్నారు. ఈ కథ 2025లో పట్టాలెక్కబోతోందని తెలుస్తోంది.
దక్షిణాదిన చిత్ర పరిశ్రమలన్నీ అమీర్‌తో పనిచేయడానికి బారులు కడుతున్నాయి. ఒక అగ్ర నిర్మాత అమీర్‌ను దృష్టిలో ఉంచుకొని పరిణితి చెందిన కామెడీ ఎంటర్టైన్మెంట్ స్టోరీని డెవెలప్ చేస్తున్నారట. ప్రముఖ నిర్మాత మధు మంతెన అమీర్‌తో 'గజిని2' తీసేందుకు సిద్ధమవుతున్నారని వినిపిస్తోంది. మరి ఆమిర్ ఇందులో ఏ కథకు తన ఓటు వేస్తాడో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com