Bollywood : గాయాలతోనే షూటింగ్ లో....

బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టికి శనివారం షూటింగ్ స్పాట్ లోనే ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఓ యాక్షన్ సన్నివేశంలో ఆయన చేతికి పెద్ద గాయమైంది. వెంటనే కామినేని హాస్పిటల్స్‌కు తరలించగా, రోహిత్ శెట్టికి చేతికి చిన్నపాటి సర్జరీ చేసినట్లు వైద్యులు తెలిపారు.
మరోవైపు రోహిత్ శెట్టి తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానంటూ, ఓ ఫోటోతో సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. అంతేకాకుండా ఆ పోస్ట్ కి ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చాడు. `మరో కారు బోల్తా... కానీ ఈసారి 2 వేళ్లకు కుట్లు వేశారు. చింతించాల్సిన పని లేదు.. నేను బాగానే ఉన్నాను. మీ ప్రేమ శ్రద్ధకు చాలా ధన్యవాదాలు` అంటూ హార్ట్ ఈమోజీలను షేర్ చేశాడు రోహిత్. దీంతో తమ డైరెక్టర్ ఈజ్ బ్యాక్ అంటూ పలువురు నెటిజన్లు తెగ ఖుషీ అవుతూ, కామెంట్స్ చేస్తున్నారు.
ఇక గాయపడిన రోహిత్ షూటింగ్ కు కాస్త బ్రేక్ ఇస్తాడేమో అని అందరూ అనుకున్నారు. కానీ, మనోడు మహా మొండికదా, అందుకే చేతికట్టుతోనే షూటింగ్ స్పాట్ లో ప్రత్యక్షం అయ్యాడు. ఏమైనా రోహిత్ వర్క్ డెడికేషన్ కు హాట్స్‌ఫ్ అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రోహిత్ శెట్టి పెట్టిన పోస్ట్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com