Bollywood : మళ్లీ పెళ్లి...! వయసులో తనకన్నా ఎంత చిన్నదంటే...

Bollywood : మళ్లీ పెళ్లి...! వయసులో తనకన్నా ఎంత చిన్నదంటే...
X
పెళ్లి చేసుకోనున్న హృతిక్ రోషన్-సబా ఆజాద్; ఈ ఏడాదిలో పెళ్లికి సిద్దమవుతున్న కొత్త జంట

బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ సబా ఆజాద్‌ అనే యంగ్‌ హీరోయిన్‌ తో డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఎంతోకాలం చట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట ఈ ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారన్న వార్త బీటౌన్‌ లో చక్కర్లు కొడుతోంది.

ఈ వార్తల్లో నిజమెంత అంటే... ఇంత అనేలా ఉంది వ్వవహారం. ఇప్పటికే హృతిక్‌, సబా కలిసి చట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారు. డిన్నర్ డేట్ లు, ఫ్యామిలీ వెకేషన్ లు... అంటూ తెగ హడావిడి చేసేస్తున్నారు. ఇద్దరూ కలసి దిగిన పిక్స్ ను సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు. దీంతో వీరిద్దరి వ్యవహారం ముదిరి పాకాన్న పడిందని అందరికీ అర్థమైపోయింది.


ఇక ఇరువురూ పెళ్లి పీటలెక్కేస్తున్నారని బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 2014లో పరస్పర అంగీకారంతో సుజానే ఖాన్‌ నుంచి దుగ్గూ విడాకులు పొందిన సంగతి తెలిసిందే. ఆ మధ్య కంగనా రనౌత్ తో కాస్త స్నేహంగా మెలిగినా, ఆ తరువాత ఇద్దరి మధ్య వ్యవహారం బెడిసికొట్టింది. దీనిపై కంగన కోర్టు వరకూ వెళ్లి రచ్చ చేసిన ముచ్చటా ఎరుకే.


ఇక చాలా కాలం తరువాత మళ్లీ సబా ఆజాద్ తో ప్రేమలో పడ్డ హృతిక్ తాజాగా ఆమెతో పెళ్లికి సిద్ధమయ్యాడని తెలుస్తోంది. హృతిక్‌ ఎక్స్‌ వైఫ్‌ సుస్సన్నే ఖాన్ సైతం, సబాతో సన్నిహితంగా ఉంటోంది. ఏమైనా ఈ ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారంటూ బీటౌన్‌ లో వార్తలు వినిపిస్తున్నాయి.

Tags

Next Story