Bollywood: 'పఠాన్'ట్రైలర్.. వేరేలెవల్

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పఠాన్'. దాదాపు నాలుగేళ్ల తర్వాత షారుఖ్ నుంచి వస్తున్న మూవీ కావడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లే రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది.
ఎన్నో వివాదాలను ఎదుర్కొన్న 'పఠాన్' మూవీ అన్నీ అడ్డంకులను తొలగించుకుని ఎట్టకేలకు ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఫ్యాన్స్ కోరుకున్న విధంగానే షారుఖ్ తన మార్కు యాక్షన్ తో పాటు, పవర్ ఫుల్ డైలాగ్స్ తో అలరించారు. ఇక షారుక్, జాన్ అబ్రహం మధ్య వచ్చే సన్నివేశాలు ఉత్కంఠ భరితంగా ఉంటాయని, మునుపెన్నడూ చూడనటువంటి యాక్షన్ థ్రిలర్ లో షారుఖ్ ఖాన్‌ను చూడవచ్చని చిత్ర బృందం తెలిపారు. బ్యూటీఫుల్ లొకేషన్స్, యాక్షన్ సన్నివేశాలతో పాటు, దీపిక అందాలారబోతతో ఈ మూవీ వేరేలెవల్ లో ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది.
ఇక ఈ చిత్రం ఈ నెల 25న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ట్రైలర్ రిలీజ్ కి ముందే ఎన్నో వివాదాలకు తెరలేపిన ఈ మూవీ రిలీజ్ అనంతరం ఎలాంటి రిజల్ట్ ను అందుకోనుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com