Bollywood: చూడాల్సింది అది కాదంటోన్న ఆలియా...

బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్ధానాని సంపాదించుకున్న నటి అలియా భట్. రీసెంట్ గా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన అలియా, తన మాతృత్వం గురించి ఆశక్తికర వ్యాఖ్యలు చేసింది.
బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తన శరీరంతో వచ్చిన మార్పుల గురించి సోషల్ మీడియాలో తన అనుభూతులను పంచుకుంది. మాతృత్వ జీవితాన్ని ఎంతగానో ఆశ్వాదిస్తున్నానని, ఇది చాలా ప్రత్యేకమని వెల్లడించింది. బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం తన శరీరంలో అనేక మార్పులు వచ్చాయని, గర్భం దాల్చిన సమయంలో ప్రతీ స్త్రీలోనూ మార్పులు సంభవిస్తాయని, బాడీలో రిలీజ్ అయ్యే హార్మోన్లు కూడా ఓ కారణమని అలియా తెలిపింది.
ఇక తనను మాతృత్వం చాలా మార్చేసిందని, తన శరీరం, చర్మం, ఛాతి పరిణామాలతోపాటు, ఆలోచనా విధానంలోనూ ఎన్నో మార్పులు వచ్చాయని తెలిపింది. కొన్ని సందర్భాల్లో తనకు ఎన్నో భయాలు కూడా వచ్చాయని, కానీ ఎన్ని మార్పులు వచ్చినా తన హృదయంలో మాత్రం ఎలాంటి మార్పురాలేదని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన శరీరంలో వచ్చిన మార్పులు కాకుండా అందరూ తన విశాలమైన హృదయాన్ని చూడాలని అలియా భట్ పేర్కొంది. తన పాప రాకతో తమ జీవితంలో ఎన్నో కొత్త ఆనందాలు విల్లివిరిశాయని తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com