Bollywood: పైసలు చూసి పెళ్లాడిన టాప్ హీరోయిన్లు... వీరే...

Bollywood: పైసలు చూసి పెళ్లాడిన టాప్ హీరోయిన్లు... వీరే...
X
బాలీవుడ్‌ లో అత్యంత ధనవంతులను పెళ్ళాడిన తారామణులు; కోటీశ్వరులను పెళ్లాడిన హీరోయిన్స్...

డబ్బెవరికి చేదు అనేవారు కొందరైతే... డబ్బే లోకం కాదని వాదించేవారు మరికొందరు. అయితే గ్లామర్ ఇండస్ట్రీలో మొదటి సూత్రాన్ని ఫాలో అయ్యేవారే ఎక్కువ. ధనం మూలం ఇదం జగత్ అన్న రీతిన... డబ్బు ఉంటే చాలు సమాజంలో పరపతి, హోదా, విలాసవంతమైన జీవితాన్ని పొందవచ్చుని నిరూపిస్తున్నారు. టాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ వరకు ఎందరో నటీమణులు అత్యంత ధనవంతులైన వ్యక్తులను వివాహం చేసుకుని లైఫ్‌ ని బిందాస్‌ గా గడిపేస్తున్నారు.

బాలీవుడ్‌ లో ఇలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న నటీమణులు చాలా మంది ఉన్నారు. ఆ జాబితాలో ముందు వరుసలో నిల్చున్న బ్యూటీ శిల్పా శెట్టి. బ్రిటిష్ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకున్న ఈ స్లిమ్ బ్యూటీ అత్యంత విలాశవంతమైన జీవితాన్ని గడుపుతోంది. అనేక వ్యాపారాలు కలిగిన రాజ్ కుంద్రాని 2009లో వివాహమాడి సెటిల్ అయింది.


స్టార్ కిడ్ అయిన సోనమ్ కపూర్ ముంబై లో పెద్ద వ్యాపార వేత్తగా పేరున్న ఆనంద్ అహుజాను 2018లో పెళ్లి చేసుకుంది. పెళ్లి అయిన తర్వాత కూడా సినిమాలలో నటిస్తూ ఇటు కెరియర్‌ తో పాటు, అటు లైఫ్‌ లో కూడా తెగ ఎంజాయ్‌ చేస్తోంది. ఇటీవలే ఓ బిడ్డకు తల్లైంది కూడా.

ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చలామణి అయిన జూహీ చావ్లా, బడా వ్యాపార వేత్త అయిన జై మెహెతాని పెళ్లి చేసుకుంది. ఇక స్టార్ హీరోయిన్ గా సౌత్ లో పలు సినిమాలు చేసిన అసిన్, ప్రముఖ సెల్ ఫోన్ కంపెనీ మైక్రో మాక్స్ సహ వ్యవస్థాపకుడు అయిన రాహుల్ శర్మను 2016లో వివాహం చేసుకుంది. ఇలా కోట్లకు పడగెత్తిన వారిని వివాహమాడి లైఫ్ లో ఎటువంటి లోటు లేకుండా లగ్జరీ లైఫ్‌ ను ఎంజాయ్‌ చేస్తున్నారు ఈ తారామణులు.


Tags

Next Story