Bollywood: రాఖీ సావంత్ అరెస్ట్...

ఐటమ్ బాంబ్ గా పేరుగడించిన రాఖిసావంత్ కటకటాలపాలైంది. ఈరోజు అంబోలీ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సొంత డాన్స్ అకాడమి ప్రారంభోత్సవ కార్యక్రమంలో బిజీగా ఉన్న రాఖీని పోలీసులు అరెస్ట్ చేయడం బాలీవుడ్ లో కలకలం సృష్టిస్తోంది.
బోల్డ్ బ్యూటీగా పేరుగడించిన రాఖీపై గతేడాది మరో ఐటమ్ గర్ల్ షెర్లిన్ చోప్రా ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసిన సంగతి తెలిసిందే. గతంలో దర్శకుడు సాజిద్ ఖాన్ పై మీటూ ఆరోపణలు చేసిన షర్లిన్, అక్కడితో ఆగకుండా బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ సాజిద్ ను కాపాడుతున్నాడని పెద్ద ఎత్తున వివాదానికి తెరలేపింది.
ఈ వ్యవహారంలో తలదూర్చిన రాఖీ సాజిద్ ఖాన్ కు మద్దతుగా నిలబడింది. ఎవరి వాదనలో ఎంత నిజముందో అందరికీ తెలుసునని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే రాఖీ తనను పబ్లిక్ గ్గా అవమానించింది అంటూ షెర్లిన్ చోప్రా ఎఫ్.ఐ.ఆర్ ను నమోదు చేసింది.
షర్లిన్ ఫిర్యాదు మేరకు ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసుకున్న పోలీసులు నేడు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే, రాఖీ ధరఖాస్తు చేసుకున్న ముందస్తు బెయిల్ ను ముంబై సెషన్స్ కోర్టు నిరాకరించిన సంగతి తెసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com