Bollywood: మోదీ మస్త్ చెప్పారు....

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే సినిమాల పట్ల, నటుల పట్ల అనవసరమైన వ్యాఖ్యలు చేయవద్దని తన కేబినెట్ మంత్రులకు సూచించిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యల పట్ల నటుడు అక్షయ్‌కుమార్ తను నటిస్తున్న సెల్ఫీ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో స్పందించాడు.
ఇండస్ట్రీ పట్ల పాజిటీవిటీనీ ఎల్లప్పూడూ స్వాగతిస్తామని పేర్కొన్నాడు. దేశ ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా గొప్ప విషయమని తెలిపాడు. అలాంటి స్థాయిలో ఉన్న వ్యక్తి ఏం అంశంపై మాట్లాడినా అందులో మాల్పులు చోటుచేసుకుంటాయని తెలిపారు.
సెన్సార్ బోర్డు ప్రకారమే తాము సినిమాలు తీస్తామని కానీ మధ్యలో వేరే వారు జోక్యం చేసుకోవడం మూలంగా అంతా గజిబిజిగా మారుతోందని వ్యఖ్యానించాడు. అలాంటివి చోటు చేసుకోకుండా ప్రధానీ స్పందించడం చాలా గొప్ప విషయమని పేర్కొన్నాడు. ఇక సెల్ఫీ సినిమా విషయానికి వస్తే రాజ్ మెహెతా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో హిమ్రాన్ హస్మి, నుస్రత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరీ 24 న విడుదలకు సిద్ధమవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com