Bollywood: సెల్ఫీ దిగాడు.. ఫోన్ విసిరేశాడు...

Bollywood: సెల్ఫీ దిగాడు.. ఫోన్ విసిరేశాడు...
ఫ్యాన్ ఫోన్ విసిరేసిన రణ్ బీర్ కపూర్; మరీ అంత అహంకారం పనికిరాదంటోన్న ఫ్యాన్స్....

బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ మరోసారి తన పైత్యాన్ని ప్రదర్శించుకున్నాడు. మీడియా ముందే ఓ అభిమాని ఫోన్ విసిరేసి అనవసరమైన హంగామా సృష్టించాడు. ఇటీవలే ఓ ఈవెంట్ కు హాజరైన రణ్ బీర్ కపూర్ వద్దకు వచ్చిన ఓ అభిమాని కోరిక మన్నించి సెల్ఫీకి ఫోజులిచ్చాడు. అయితే ఆ అబ్బాయి వరుసగా కొన్ని సెల్ఫీలు తీసుకుంటుండగానే రణ్ బీర్ కు ఉన్నట్లుండి కోపం తన్నుకు వచ్చేసింది. రెండు మూడు సార్లు ఫోజులిచ్చినట్లే ఇచ్చి అబ్బాయి చేతి లోనుంచి ఫోన్ గుంజుకున్నాడు. అంతే అమాంతం దాన్ని వెనక్కు విసిరేశాడు. దీంతో సదరు అభిమాని ముఖం మాడిపోయింది.


అయితే ఈ వ్యవహారమంతా మీడియా ముందే జరగడంతో అంతా రికార్డ్ అయింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక రణ్ బీర్ లో మరో యాంగిల్ ను చూసి విస్తుపోతున్న నెటిజెన్లు తమ నోటికి పని చెబుతున్నారు. ఎంత హీరో అయితే మాత్రం మరీ ఇంత పొగరా అంటూ రణ్ బీర్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక పోతే ఇదంతా ఏదో పబ్లిసిటీ స్టంట్ అనే వాళ్లూ లేకపోలేదు. ఏదో యాడ్ కోసం జరిగిన తతంగంలా ఉంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే.. మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.....



Tags

Read MoreRead Less
Next Story