Bollywood: ఖాన్స్ అంటే ఎంత ఇష్టమో... !

Bollywood: ఖాన్స్ అంటే ఎంత ఇష్టమో... !
పఠాన్ పై మరో ట్వీట్ చేసిన ఫైర్ బ్రండ్; ఖాన్స్ అంటే ఎంత ప్రేమో అంటూ ట్వీట్ చేసిన కంగన...

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ వరుస ట్విట్లతో చెలరేగిపోతోంది. ప్రస్తుతం పఠాన్ మూవీని టార్గెట్ చేసిన కంగన దీనికి సంబంధించి ఎవరు ఏ ట్వీట్ చేసినా వారికి కౌంటర్లు ఇస్తూ హడావిడి చేస్తోంది. తాజాగా అమ్మడి వాగ్ధాటికి పఠాన్ నిర్మాత ఖంగుతిన్నాడనే చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా మూవీ సూపర్ హిట్ టాక్ సంపాదించుకోవడంతో పఠాన్ నిర్మాత చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశాడు. అంతేకాదు, ఈ సక్సెస్ ద్వారా హిందూ, ముస్లిమ్ లు షారుఖ్ ను సమానంగా ఆదరిస్తున్నారని, బాయ్ కాట్ వంటి కాంట్రావర్శీలు సినిమాకు మంచి చేస్తాయే తప్ప చెడు చేయవని, ఎరోటికా- మంచి సంగీతం సినిమాకు కలసివస్తాయని, భారత్ సార్వభౌమత్వం వర్ధిల్లుతోందని నిరూపితమైందని ట్వీట్ చేశాడు. ఇక దీనిపై తనదైన శైలిలో స్పందించిన కంగన ఇది మంచి విశ్లేషణ అంటూ ప్రశంసించింది. ఈ దేశం ఖాన్స్ అందరినీ ఆదరించిందని, వారిని మాత్రమే ప్రేమించిందని వెల్లడించింది. అంతేకాదు భారతీయులు ఇస్లాం నటీమణులనూ కూడా విపరీతంగా ఆదరిస్తారు అని ట్వీట్ చేసింది. కాబట్టి, భారత్ ఫాసిజాన్ని, ద్వేషాన్ని వ్యాప్తి చేస్తుందన్న ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేసింది. భారత్ లాంటి దేశం ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదని కొనియాడింది. ఏమైనా కంగన మాటల్లో వాస్తవం లేకపోలేదన్నది భారతీయుల మాట.




Tags

Read MoreRead Less
Next Story