Bollywood: జాన్ అబ్రహంపై షారుఖ్ ప్రశంసలు

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ లేటెస్ట్ మూవీ పఠాన్ కలెక్షన్లు కొల్లగొడుతూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో జాన్ అబ్రహంపై షారుఖ్ ప్రశంసలు కురిపించారు. పఠాన్ లో జాన్ అబ్రహం చేసిన జిమ్ రోల్ మూవీకి వెన్నెముక లాంటిదన్నారు. దీపిక గురించి మీకు ఇప్పటికే తెలుసు. మా గురించి మీరేం ప్రశ్న అడిగినా ఆమె చేతిపై ముద్దు పెడతా అదే సమాధానం అవుతుంది అంటూ పరిహాసించారు. తనను అక్బర్‌తో పోల్చుకున్న షారుఖ్ దీపికను అమర్ అని, జాన్ అబ్రహంను ఆంటోనీగా అభివర్ణించారు. సినిమా అంటే అదేనని, వ్యక్తుల మధ్య తారతమ్యాలు ఉండవని అన్నారు. తామంతా సినిమాను ఎంతగానో ప్రేమిస్తామని తెలిపారు. షారుఖ్, దీపికా, జాన్ అబ్రహం ముఖ్యపాత్రల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ పఠాన్. సిద్ధార్థ్ ఆనంద్ డైరక్షన్‌లో వచ్చిన ఈ సినమా జనవరీ 25న విడుదలైంది. రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ను వసూలు చేసింది. థ్యాంక్స్ మీట్‌లో సినిమా బృందం ముంబయిలో ఈవెంట్ నిర్వహించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com