Bollywood: కెమెరామెన్ ఆమిర్ ఖాన్ తో సల్లూమియా.....

Bollywood: కెమెరామెన్ ఆమిర్ ఖాన్ తో సల్లూమియా.....
సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న బడా ఖాన్స్ ఫొటో; ఆమిర్ ఖాన్ కుటుంబ సభ్యులతో సల్మాన్....
బాలీవుడ్ బడా ఖాన్స్ మధ్య స్నేహ బంధం గురించి తెలిసిందే. ఒకరి కోసం మరొకరు చిన్న చిన్న సహాయాలు చేసుకోవడం, కలసి పార్టీలు చేసుకోవడం వీరి మధ్య పరిపాటి. ఇక సల్మాన్-షారుఖ్ సైతం తమ మధ్య బేధాభిప్రాయాలు పక్కన పెట్టి, కలసి నటించడం అభిమానులకు మాంచి కిక్ ఇస్తోంది. ఇటీవలే పఠాన్ సినిమాలో సల్మాన్ ఖాన్ గెస్ట్ అప్పీరెన్స్ ఏ రేంజ్ లో కలెక్షన్లు రాబట్టిందో ప్రత్యేకించి చెప్పాల్సి పనిలేదు. ఇక ఆమిర్ ఖాన్ తో సల్లూమియాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఏళ్లుగా వీరి బంధం మరింత బలపడిందనే చెప్పాలి. క్లిష్ట సమయాల్లోనూ ఒకరి తోడు మరొకరు విడవలేదు. పఠాన్ సినిమాలో ఆమిర్ సోదరి నిఖత్ హెగ్డే కీలక పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో సల్మాన్, ఆమిర్ ఇంటికి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పఠాన్ రిలీజ్ కు ముందు ఆమిర్ ఇంటికి వెళ్లిన సల్మాన్ అతడి కుటుంబ సభ్యులతో కలసి సందడి చేశాడు. వారితో కలిసి ఫొటోలు కూడా దిగాడు. నిఖత్ ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఫోటోల్లో ఆమిర్ కనిపించడంలేదు అన్నవారికోసం మరో ఫోటోను షేర్ చేసింది నిఖత్. అందులో ఫొటో తీస్తోంది అతడనే అని తెలిసి ఆశ్చర్యపోవడం ఫ్యాన్స్ వంతు అయింది. ఇక నిమిషాల వ్యవధిలో వైరల్ గా మారిన ఈ ఫొటోకు కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఆమిర్, సల్మాన్ ఎప్పుడు ఇలానే ఉండాలని, ఈ ఫోటో చాలా క్యూట్ గా ఉందని అభిమానులు మురిసిపోతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story