Bollywood: స్వచ్ఛతా - దైవత్వం నీలోనే... ఉర్ఫీకి కంగన ఊరట

అరకొర బట్టలతో, అనవసర అంగాంగ ప్రదర్శనలతో రెచ్చిపోతూ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న ఉర్ఫీ జావేద్ కు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ అండగా నిలిచింది. ఆ మధ్య ఇద్దరి నడుమా పొరపొచ్చాలు వచ్చిన సంగతి మరచిపోకముందే...కంగన ఉర్ఫీపై ఎక్కడ లేని ప్రేమ కురిపించేస్తోంది. ట్విట్టర్ వేదికపైకి రీ ఎంట్రీ ఇచ్చిన కంగన నిన్నటివరకూ పఠాన్ పై ద్వందార్థ ట్వీట్లతో విరుచకుపడింది. మొన్న పఠాన్ పై కంగన భారతీయులకు ఖాన్స్ అన్నా, ఇస్లాం హీరోయిన్లు అన్నా ఎంతో ఇష్టమని కామెంట్ చేసిన సంగతి తెలసిందే. అయితే దీనిపై స్పందించిన ఉర్ఫీ మతాల ఆధారంగా కళ విభజనకు గురవ్వలేదని రిప్లై ఇచ్చింది. దీనికి పాజిటివ్ గా స్పందంచిన కంగన యూనిఫార్మ్ సివిల్ కోడ్ గురించి చెప్పుకొచ్చింది. అయితే దీనిపై చమత్కరించిన ఉర్ఫీ అది తనకు సెట్ అవ్వదని చెప్పింది. దీంతో మురిసిపోవడం కంగన వంతైంది. ఆమెపై ఎక్కడలేని ప్రేమ పొంగుకొచ్చేసందో ఏమో... నువ్వు స్వచ్ఛమైన దానివి, నీలో దైవత్యం దాగి ఉందంటూ తెగ పొగిడేసింది. ఇక ఇందుకు గానూ, పురణాల్లోని అక్కమహాదేవి ప్రస్థానాన్ని గుర్తుచేసింది. భారతీయ రాణి అయిన అక్కమహాదేవి శివుడిని ఆరాధించేవారు. అందరి ముందరా తనకు శివుడు అంటేనే ఇష్టమని, భర్త అంటే ఇష్టం లేదని స్పష్టం చేయడంతో... ఆమె భర్త ఓ కుటిల యత్నానికి పూనుకున్నాడు. తాను ఇష్టం లేకపోతే తన ద్వారా పొందినవన్నీ వదిలేయాలని ఆజ్ఞాపించాడు. అంతే ఆమె వంటి మీద దుస్థుల సహా అన్నీ అక్కడే వదిలేసింది. మళ్లీ జీవితంలో ఆమె వస్త్రాన్ని ధరించలేదు. అడవిలో జీవించిన ఆమె నేటి మహిళలకు ఆదర్శమనే చెప్పాలి. అందుకే తనను అవమానించే అధికారం ఎవరికీ ఇవ్వద్దని ఉర్ఫీని కోరింది కంగన.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com