Bollywood: మాతృత్వపు మాధుర్యం

Bollywood: మాతృత్వపు మాధుర్యం
మాతృత్వంపై స్పందించిన బోల్డ్ బ్యూటీ బిపాషా బసు; అమ్మతనం ఎంతో అందంగా ఉందంటూ ట్వీట్....

బోల్డ్ రోల్స్ తో బాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసిన బిపాషాబసు గతేడాది నవంబర్ లోనే ఓ బుజ్జి పాపాయికి తల్లైన సంగతి తెలిసిందే. చిట్టితల్లికి దేవి బసు సింగ్ గ్రోవర్ అని నామకరణం కూడా చేశారు బిపాశా, కరణ్ దంపతులు. అయితే పాపాయిని సోషల్ మీడియాకు దూరంగానే ఉంచుతోన్న బిపాశా అడపాదడపా ఇన్స్టాలో పోస్ట్ లు పెడుతూ ఫ్యాన్స ను మురిపిస్తూనే ఉంది. తాజాగా చిన్నారితో ఆడుకుంటోన్న ఫోటోను షేర్ చేసింది. దీంతోపాటే మాతృత్వం ఎంతో మధురమైనది, అందమైనది అంటూ భావోద్వేగపూర్తి పోస్ట్ పెట్టింది. ఒకానొక సమయంలో గ్లామర్ కు కేర్ ఆఫ్ అడ్రెస్ గా వెలుగొందిన బిపాశాను ఈ విధంగా చూడటం కొందరికి ఆశ్చర్యం కలిగించినా... మాతృత్వాన్ని పూర్తిగా ఆశ్వాదిస్తోన్న ఆమెను చూడటం మరింత మందికి ఆనందాన్ని పంచుతోంది. ముఖ్యంగా ఫొటోలో బుజ్జాయి కాళ్లతో ఆడుకుంటోన్న బిపాశా ముఖంలో ఉట్టిపడుతోన్న సంతోషం, రెట్టింపు అయిన ఆమె అందం అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. ఏమైనా తన జీవితంలో అమ్మ పాత్ర ఎంతో అందమైనదని, ఆ అమ్మవారికి కృతజ్ఞతలు తెలియజేసింది బిపాశా. దేవుడు తనకు ఇచ్చిన అపురూపమైన బహుమతి తన బిడ్డేనని ట్విట్టర్ లో హృద్యమైన పోస్ట్ పెట్టింది.

Tags

Read MoreRead Less
Next Story