Bollywood: నేను హర్టయ్యా...

అతిలోక సుందరి అయిన తల్లి అడుగుజాడల్లో సినీ రంగంలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకుంది శ్రీదేవి తనయ జాన్వీ కపూర్. ప్రస్తుతం అమ్మడి కెరీర్ సాఫీగానే సాగుతోందని చెప్పాలి. అయితే నెపోటిజం పై జరుగుతున్న చర్చ తెరపైకి వచ్చినప్పుడల్లా స్టార్ కిడ్స్ అందరూ ఎదుర్కొనే సమస్యే అమ్మడినీ పట్టిపీడిస్తోందట. ఇదే విషయాన్ని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఈ భామ. ఇటీవలే ఓ నెటిజెన్ కామెంట్ తనని ఎంత బాధపెట్టిందో వెల్లడించింది. యాక్టింగ్ రాకపోతే ఎందుకు నటిస్తున్నావ్, నెపోటిజం పిల్లా అంటూ ఓ వ్యక్తి తనని ట్రోల్ చేసిన విషయాన్ని గుర్తుచేసుకుంది. తాను విమర్శలకు ఎప్పుడు గౌరవిస్తానని, కానీ, అదే విషయాన్ని వేరేగా కూడా చెప్పవచ్చని తెలిపింది. మిలీలో మీ నటన బాగుంది, కానీ, ఇంకా బాగా చేసే అవకాశం ఉందని చెబితే.. దాన్ని గౌరవిస్తానని వెల్లడించింది. దురసైన మాటలతో అవకాశం కోసం ఎదురుచూసే వారు, కేవలం ఎదుటివారి ఆనందాన్ని ఒక్క మాటతోనే తుంచేయడానికి ప్రయత్నిస్తుంటారని మనసులోని బాధను చెప్పకొచ్చింది. అంతేకాదు... జనాలు తన సినిమాను చూసేందుకు వచ్చేప్పుడు తటస్థంగా రారని, తనకీ అవకాశం ఎంతో సులభంగా వచ్చింది, ఆమె పెట్టిపుట్టింది అన్న భావనతోనే వస్తారని తెలిపింది. ఏమైనా సీత కష్టాలు సీతవి అన్నట్లు ఓ వైపు ఒక్క అవకాశం కోసం అర్రలు చాస్తున్న వారిది ఒక పోరాటమైతే... నెపో కిడ్స్ ఇది ఇంకో రకమైన పోరాటం. ప్రస్తుతం జాన్వీ కపూర్ ధఢక్ అనే సినిమాలో నటిస్తోంది. అనంతరం జనగణమణ అనే చిత్రానికి సంతకాలు చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com