Bollywood: బిగ్ బాస్16 కు సల్మాన్ గుడ్ బైయ్

దేశంలోనే అత్యంత పాపులర్ రియాలిటీ టీవీ షో గా బిగ్‌బాస్ గుర్తింపు తెచ్చుకుంది. ఆ షోకు హోస్ట్ గా సల్మాన్‌ఖాన్ గత ఎనిమిది సీసన్లుగా వ్యవహరిస్తున్నాడు. అత్యంత కాంట్రవర్సియల్ షో గా పేరుతెచ్చుకున్న ఈ షో ఇప్పుడు 16 సీసన్లోకి అడుగు పెట్టింది. ఈ షోకు సల్లూ భాయ్ ఇక గుడ్ బై చెప్పేస్తున్నాడు. సల్లూ కాంట్రాక్ట్ గడువు ముగియడంతో తప్పుకుంటున్నారు.
ఇక నుంచి బిగ్‌బాస్16 పగ్గాలను కరణ్ జోహార్ చేపట్టనున్నాడని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న కండల వీరుడి అభిమానులు సల్మాన్ లేకుంటే బిగ్ బాస్‌లో సందడి ఉండదని అంటున్నారు. బిగ్‌బాస్ 16 వీకెండ్ కా వార్ ఫైనల్‌కు హోస్ట్‌గా సల్మాన్ ఖాన్ వస్తాడని తెలుస్తోంది. కానీ దానిపై ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com