Bollywood: కండలవీరుడితో పూరీ.. కిక్కిచ్చే కాంబో అంటే ఇదే మరి

Puri Jagannadh with Salman Khan: గ్యాప్ లేకుండా బాక్సాఫీస్ మీద దండయాత్ర చేసే పూరి జగన్నాథ్ లైగర్ తరువాత బొత్తిగా హడావిడి చేయడమే మానేశాడు. ఈ మధ్య ఈడీ నోటీసులు, విచారణతో మన డైనమిక్ డైరెక్టర్ కాస్త డిస్ట్రబ్ అయ్యాడేమో అని అనుకున్నాం. కానీ, ఇవేమీ పూరీ స్పీడుకు బ్రేకులు వేయలేవని మరోసారి నిరూపితమైంది. ఎందుకంటే పూరీ క్యాంప్ నుంచి అదిరిపోయే వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈసారి మనోడు ఏకంగా బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్‌ని బరిలోకి దింపేందుకు సిద్ధమయ్యాడని వినిపిస్తోంది.
కెరీర్ లో ఊహించని డిజాస్టర్ అందుకున్న పూరీ కాస్త గ్యాప్ ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ ట్రాక్ లోకి వచ్చేశాడని తాజా వార్త సారాంశం. ఇటీవలే సల్మాన్ ఖాన్ కు ఓ స్క్రిప్ట్ వినిపించగా, భాయ్ జాన్ కు అది తెగ నచ్చేసిందని టాక్. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఏమైనా ఫ్యాన్స్ కు మాత్రం ఈ ముచ్చట భలే కిక్ ఇస్తోందనే చెప్పాలి.
ఇటీవలే గాడ్ ఫాదర్ లో సల్మాన్, పూరీ ఇరువురూ గెస్ట్ రోల్స్ లో కనిపించిన సంగతి తెలిసిందే. ఏమైనప్పటికీ వీరి కాంబినేషన్ గానీ సెట్ అయితే, సినిమా మరో ట్రెండ్ క్రియేట్ చేసినట్లే. లైగర్ వల్ల డీలా పడ్డ పూరీ జగన్నాథ్ సైతం ఈ సినిమాతో కోలుకునే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com