Bollywood: ప్రముఖ బ్రాండ్ కు అనుష్క డెడ్లీ వార్నింగ్! ఆమెతో అంత వీజీ కాదు మరి..

Bollywood: ప్రముఖ బ్రాండ్ కు అనుష్క డెడ్లీ వార్నింగ్! ఆమెతో అంత వీజీ కాదు మరి..
అనుమతి లేకుండా తన ఫోటోలు వాడేసారంటూ చిందులు తొక్కుతున్న లాంగ్ లెగ్స్ బ్యూటీ; ప్రముఖ బ్రాండ్ కు అనుష్క చురకలు

Anushka Sharma: బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ముక్కుసూటితనం గురించి ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు. ఉన్నది ఉన్నట్లు ముఖాన చెప్పేసే ఈ బ్యూటీతో కాస్త జాగ్రత్తగానే ఉండాలన్నది బాలీవుడ్ టాక్. అయితే, ఈ విషయం తెలిసో తెలియకనో ఓ ప్రముఖ బ్రాండ్ పోయి పోయి అమ్మడితో పెట్టుకుంది. ఇంకేముంది ఇప్పుడు సంజాయిషీ చెప్పుకునే పరిస్థితికి వచ్చింది.



సోషల్ మీడియాలో మస్త్ యాక్టివ్ గా ఉండే అనుష్క ఈ మధ్యే ఓ అందమైన ఫొటోను తన పేజ్ లో అప్ లోడ్ చేసింది. అప్పుడే వర్కౌట్స్ చేసేందుకు సిద్ధమవుతోందో ఏమో ప్యూమా స్పోర్ట్స్ వేర్ లో మెరిసిపోయింది. ఇక ఈ ఫోటోకు లైకులు, కామెంట్లు వెల్లువెత్తుతుండగా, సదరు బ్రాండ్ కూడా కాస్త ముచ్చట పడి తమ ఇన్‌స్టా హ్యాండిల్ లో అమ్మడి ఫోటోను రీ షేర్ చేసింది. అక్కడ మొదలైంది అసలు తంటా.



ఈ పోస్టే అనుష్క ఆగ్రహానికి కారణమైందిట. తన అనుమతి లేకుండా తన ఫొటోను ఎలా వాడేస్తారంటూ ఘాటుగా స్పందించింది. నేను మీ బ్రాండ్ అంబాసిడర్ ను కాను కాబట్టి వెంటనే ఫొటోను తొలగించాల్సిందిగా స్పష్టం చేసింది. మరోవైపు ప్యూమాకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న కరీనా కపూర్ ఖాన్ ఎప్పటికప్పుడు బ్రాండ్ కు ప్రమోషన్స్ చేస్తూనే ఉంది. మరి అనుష్క పోస్ట్ పై ప్యూమా సంస్థ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.








Tags

Read MoreRead Less
Next Story