Bollywood: వారిద్దరి మధ్యా అంతా ఓకేనా!

Mumbai
Bollywood: వారిద్దరి మధ్యా అంతా ఓకేనా!
రెడ్ కార్పెట్ పై భర్తను ఇగ్నోర్ చేసిన విద్యాబాలన్, సిద్ధార్ధ్ పక్కనే ఉన్నా పట్టించుకోని వైనం

Vidya Balan: వయసు మీద పడుతున్న కొద్దీ మరింత అందం ఇనుమడింపజేసుకుంటోన్న విద్యాబాలన్ నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు ఎంపిక చేసుకుంటూ దూసుకుపోతున్న వైనం చూస్తూనే ఉన్నాం. మధ్య మధ్యలో హాట్ ఫోటోలతో ఇంటర్నెట్‌ ను షేక్‌ చేస్తోంది. పెళ్లి తర్వాత కాస్త ఒళ్లు చేసినప్పటికి విద్యాబాలన్‌ గ్లామర్ పరంగా ఏమాత్రం తగ్గలే అంటోంది.


రీసెంట్ గా విద్యా బాలన్ తన భర్త సిద్ధార్థ్ రాయ్ కపూర్‌తో ఓ అవార్డు ఫంక్షన్ లో తళుక్కున మెరిసింది. రాణీ పింక్ లాంగ్ డ్రెస్ లో ఈ ఈవెంట్ కు హాజరైన విద్యా ఫోటోగ్రాఫర్లకు వివిధ యాంగిల్స్ లో పోజులు ఇచ్చింది. అయితే ప్రసుత్తం అదే ఆమెపై విమర్శలకు కారణమవుతోంది. రెడ్ కార్పెట్‌పై విద్యతో కలిసి ఫోజులిచ్చేందుకు ప్రయత్నించిన తన భర్త సిద్ధార్థ్ రాయ్ కపూర్‌ కు ఇక్కడే చేదు అనుభవం ఎదురైంది. కపూర్‌ని పట్టించుకోకుండా ఈ భామ ఫోటోలకు పోజులివ్వడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.


విద్య ఫోటోలకు పోజులిస్తూ పెపరాజీని ఎంజాయ్ చేస్తుండగా పక్కనే ఉన్న సిద్దార్ధ్ కూడా ఆమెతో కలసి ఫొటోలకు ఫోజులిచ్చే ప్రయత్నం చేశాడు. కానీ, అదేంటో కానీ, విద్య తన హబ్బీని ఏమాత్రం పట్టించుకోనట్లే కనిపించింది. ఇక ఇదంతా తనకెందుకు అనుకున్నాడో ఏమో సిద్దార్ధ్ అక్కడి నుంచి ఇబ్బందికరంగా వెళ్ళిపోయాడు. కానీ విద్య మాత్రం భర్త వెళ్లిపోయాక మరింత హ్యాపీగా ఫోజులు ఇవ్వడం ప్రారంభించింది. ఈ వీడియో చూసిన నెట్టిజన్లు విద్యా బాలన్ పై విమర్శల వర్షం గుప్పిస్తున్నారు. మీడియా లైమ్ లైట్ అంటే ఎంత ప్రీతి అయితే మాత్రం భర్తను మరీ ఇంతలా నిర్లక్ష్యం చేయాలా అని మండిపడుతున్నారు. మరోవైపు విద్యా ఫ్యాన్స్ మాత్రం కేవలం తన పిక్స్ గురించి కామెంట్స్ చేస్తూ, చబ్బీగా ఉన్నప్పటికీ విద్యా బాలన్ చాలా హాట్ గా ఉందంటూ తమ అభిమానాన్ని కురిపిస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story