Bollywood : బాలీవుడ్ జంట పెళ్లి ముచ్చట.. ముహూర్తం ఫిక్స్
Bollywood : కొత్త ఏడాదిలో మరో బాలీవుడ్ జంట పెళ్ళి పీటలెక్కబోతోంది. లవ్ బర్డ్స్ సిద్ధార్థ్ మల్హోత్రా- కియారా అద్వానీ తమ బంధాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. 2023 ఫిబ్రవరిలో వీరు పెళ్లిపీటలెక్కనున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
'షేర్షా'లో ఫస్ట్ టైమ్ స్క్రీన్ షేర్ చేసుకున్న వీరు ఆ సెట్స్ లోనే ప్రేమలో పడ్డారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరు, డేటింగ్ అంటూ, వెకేషన్స్ అంటూ చట్టాపట్టాలేసుకుని తెగ తిరిగారు. ఈ నేపథ్యంలో వీరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొంత మంది, వీరి మధ్య విభేదాలు రావడంతో బ్రేక్ అప్ దిశగా అడుగులు వేస్తున్నారంటూ తెగ వార్తలు వచ్చాయి. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్లు కియారా పేర్కొంది.
ఇక కత్రినా కైఫ్-విక్కీ కౌశల్, ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్, అనుష్క శర్మ-విరాట్ కోహ్లీ, దీపికా పదుకొణె-రణ్‌వీర్ సింగ్ లాగానే సిడ్-కియారా కూడా రాయల్ వెడ్డింగ్‌ను ఆలోచనలో ఉన్నారట. ఇందుకోసం సిద్ధార్థ్- కియారా కలిసి రాజస్థాన్‌లోని జైసల్మేర్ ఫోర్ట్‌ను పెళ్లి వేదికగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
గత కొద్దిరోజులుగా 2023లో పెళ్లి పీటలు ఎక్కబోతున్న మొదటి సెలబ్రిటీ జంట వీరే అంటూ బాలీవుడ్ లో ఓ వార్త తెగ హల్ చల్ చేస్తోంది. మరి ఈ వార్తను నిజం చేయాలనుకున్నారో ఏమో కానీ, ఎట్టకేలకు ప్రేమ పక్షులు ఫిబ్రవరిలో పెళ్లి పీటలెక్కబోతున్నట్లు సమాచారం జరుగుతోంది. ఫిబ్రవరి 4 నుంచి 6 వరకు సిడ్, కియారా పెళ్లి వేడుక జరుగనున్నట్లు తెలుస్తోంది.
ఇక జైసల్మేర్ ప్యాలెస్ హోటల్‌లో జరిగే వీరి పెళ్ళికి కుటుంబసభ్యులు, సన్నిహితులతో పాటు కొద్ది మంది బాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరుకాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. కానీ, ఈ వార్తల పై ఇంత వరకు సిధ్, కియారా స్పందించకపోవడం గమనార్హం. ఇరువురు సీక్రెట్ గా ప్రిపరేషన్స్ చేస్తున్నారని, అన్ని పూర్తయిన త్వరలోనే వీరిద్దరూ కలిసి పెళ్లి డేట్ అనౌన్స్ చేయనున్నారంటూ టాక్ వినిపిస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com