Bollywood: ఆ ముద్దు ముచ్చటలో మరో ట్విస్ట్...

Bollywood: ఆ ముద్దు ముచ్చటలో మరో ట్విస్ట్...
శిల్పాశెట్టి ధాఖలు చేసిన పిటిషన్ పై మహారాష్ట్ర ప్రతిస్పందన కోరిన హైకోర్టు...

తన ప్రమేయంలేకపోయినా ఏదోక కాంట్రావర్శీకి కేంద్ర బిందువు అవుతుంటుంది బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి. ఆ మధ్య భర్త చేస్తున్న పోర్న్ వీడియో వ్యాపారం వ్యవహారం సద్దుమణిగి ఇలా ఊపిరి పీల్చుకుందో లేదో మరో వివాదంలో వార్తలకు ఎక్కింది. అయితే ఈసారి పాత వివాదాన్నే హైకోర్టు తవ్వితీయడంతో శిల్పా శెట్టి పేరు మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చింది.



2007లోని ఓ కార్యక్రమంలో హాలీవుడ్ స్టార్ హీరో రిచర్డ్ గేరే శిల్పాశెట్టిని అమాంతం కౌగిలించుకుని సభా వేదికపైనే ఆమెను ఘాటుగా ముద్దాడిన సంగతి గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఈ ముద్దు పెద్ద దుమారాన్నే లేపింది. ఎంతోమంది పాలుపంచుకున్న ఓ వేదికపై రిచర్డ్ చేసిన పనికి సంప్రదాయవాదులు దుమ్మెత్తిపోశారు. ఈ ఘటనపై రిచర్డ్, శిల్పపై పోలీస్ కేసు కూడా నమోదు అయింది. అయితే ఇప్పుడు ఆ వ్యవహారమే కొత్త మలుపు తిరిగింది.



ఈ కేసు నుంచి తనకు విముక్తి కల్పించాల్సిందిగా బోంబే హైకోర్టులో శిల్పా శెట్టి పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని స్వీకరించిన హైకోర్టు ఈ ఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.



ఈ ముద్దు వ్యవహారంపై అప్పట్లోనే పూనమ్ చాంద్ భండారీ అనే న్యాయవాది శిల్ప, రిచర్డ్ పబ్లిక్ గా ముద్దాడుకోవడంపై కేసు నమోదు చేశారు. అయితే శిల్పా శెట్టి లాయర్ మాత్రం సదరు కార్యక్రమం ఎయిడ్స్ రోగుల కోసం ఏర్పాటు చేసిన ఛారీటీ ఈవెంట్ అని, ఈ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రిచర్డ్, శిల్పా ఆహూతులను అలరింపజేసేందుకు చాలా క్యాజువల్ గా మాత్రమే అలా వ్యవరించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇద్దరూ సెలబ్రిటీలు కావడం వల్లే ఇది ఇంత పెద్ద మ్యాటర్ అయిందని స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story