Bollywood: పడి లేచింది అందుకోసమే.. రోహిత్ శెట్టి ఎమోషనల్ పోస్ట్

బాలీవుడ్ టాప్ డైరెక్టర్ రోహిత్ శెట్టి కి హైదరాబాదులో ఓ యాక్షన్ సిరీస్ చేస్తున్న సమయంలో యాక్సిడెంట్ అయిన సంగతి తెలిసిందే. ఇండియన్ పోలీస్ ఫోర్స్ అనే వెబ్ సిరీస్ కు దర్శత్వం వహిస్తున్న రోహిత్ చికిత్స అనంతరం షూటింగ్ లో పాలుపంచుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అతడు చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. .
కామినేని హాస్పటల్ లో తన చేతికి సర్జరీ చేసిన అనంతరం ఈ డేరింగ్ డైరెక్టర్ తిరిగి షూటింగ్ కి హాజరై ఓ పోస్ట్ పెట్టాడు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానానంటూ ఆ పోస్ట్ కి ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చాడు. ఈ పోస్ట్‌తో డేరింగ్ డైరెక్టర్ ఈజ్ బ్యాక్ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. తాజాగా మరో పోస్ట్ తో రోహిత్ శెట్టి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాడు.
"సెట్ లో జరిగిన ప్రమాదం నుంచి కోలుకున్నానని, తనతో పాటు తన చిత్రబృందం కూడా చాలా కష్టపడుతున్నారని తెలిపాడు. పడి లేవడం మాకు కొత్తకాదు అంటూనే ఈ సారి కూడా లేస్తాం కేవలం యుద్ధంతో పోరాడటానికి కాదు, దానిని గెలవడానికి" అంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు రోహిత్. దీంతో వెబ్ సిరీస్ తో ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసి కనబడుతోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు ప్రస్తుతం రోహిత్ శెట్టి పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com