Bollywood: అవును ఈ కండల వీరులు... ఇస్కూలు దోస్తులట

బాలీవుడ్ హీరోల్లో హృతిక్ రోషన్, జాన్ అబ్రహమ్ కు ఉన్న క్రేజే వేరు అని చెప్పాలి. మాంచి ఒడ్డూ పొడుగుతో పాటూ చక్కని దేహ ధారుఢ్యం వీరి సొంతం. 8పలకల దేహాలతో అమ్మాయిలకు నిద్రపట్టకుండా చేయడంలోను ఎవరికి వారే సాటి. పఠాన్ లో జాన్ ఫిజిక్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. మరోవైపు దుగ్గూ కూడా ప్రతి సినిమాకూ మరింత స్మార్ట్ గా కనిపిస్తున్నాడు. అయితే ఇన్నీ సారూప్యతలు ఉన్న ఈ ఇరువురూ యాధృశ్చికంగా ఒకే పాఠశాలలో కలసి చదువుకోవడం మరో విశేషమనే చెప్పాలి. పఠాన్ సూపర్ సక్సెస్ పుణ్యమాని ప్రస్తుతం జాన్ అబ్రహం ఓ వెలుగువెలిగిపోతున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అతడి స్కూల్ ఫొటో ఒకటి బయటకు వచ్చింది. అయితే అందులో హృతిక్ కూడా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఖాకీ దుస్తులు ధరించి చిరునవ్వు చిందిస్తున్న జాన్ తో పాటూ, కాస్తంత సీరియెస్ గా కనిపిస్తున్న హృతిక్ కూడా ఈ చిత్రంలో తళుక్కుమన్నాడు. ఇప్పుడంటే పలకల దేహాలతో ముచ్చెమటలు పట్టిస్తున్నారనే గానీ, అప్పుడు ఇరువురూ మరింత ముచ్చటగా ఉన్నారని ఒప్పుకోవాల్సిందే. ఏమైనా ఇప్పటివరకూ ఇద్దరిలో ఒక్కరైనా ఈ విషయాన్ని బయటపెట్టలేదు. మరి దాని వెనుక అంతర్యం ఏమిటో వారికే తెలియాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com