Bollywood: బాలీవుడ్ ప్రముఖులకు కియారా, సిద్ధార్థ్ గ్రాండ్‌ పార్టీ

Bollywood: బాలీవుడ్ ప్రముఖులకు కియారా, సిద్ధార్థ్ గ్రాండ్‌ పార్టీ
బాలీవుడ్ నటీనటులతో సందడిగా మారిన లోయర్ పరేల్‌లోని సెయింట్ రేగిస్ హోటల్

ఇటీవల మూడుముళ్ల బంధంతో ఒక్కటైన కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా.. బాలీవుడ్ ప్రముఖులకు గ్రాండ్‌ పార్టీ ఇచ్చారు. ఫిబ్రవరి 7న వీరి వివాహం రాజస్థాన్‌లో ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, కొద్ది మంది అతిధుల మధ్య ఇరువురు వివాహ బంధంతో ఒక్కటైయ్యారు. జైసల్మేర్‌లోని సూర్యగఢ్‌ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా వివాహ వేడుక జరిగింది. ఇక నిన్న(ఆదివారం) ముంబైలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటీ నటులతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

బాలీవుడ్ నటీనటులతో లోయర్ పరేల్‌లోని సెయింట్ రేగిస్ హోటల్ సందడిగా మారింది. ఈ వేడుకలో కరణ్‌ జోహార్‌, షాహిద్‌ కపూర్‌, మనీశ్‌ మల్హోత్ర, షారుక్‌ ఖాన్‌, వరుణ్‌ ధావన్‌, అక్షయ్‌ కుమార్‌, పరిణీతి చోప్రా, జుహీ చావ్లా, అనిల్‌ కపూర్‌, అజయ్‌ దేవగణ్‌‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. రిసెప్షన్‌లో అగ్రహీరోలు, తారలు తమదైన స్టైల్‌లో డ్యాన్స్‌ చేస్తూ సందడి చేశారు.

Tags

Read MoreRead Less
Next Story