Kangana Ranaut : నటి కంగనాకి కరోనా పాజిటివ్..!

Kangana Ranaut  : నటి కంగనాకి కరోనా పాజిటివ్..!
నటి కంగనా రనౌత్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్నీ ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. గత వారం రోజులుగా అలసటగా ఉంది. నిన్న టెస్టు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది.

నటి కంగనా రనౌత్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్నీ ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. గత వారం రోజులుగా అలసటగా ఉంది. నిన్న టెస్టు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. క్వారంటైన్ లో ఉన్నాను. ఈ వైరస్ కి నా శరీరంలో చోటు లేదు. దాన్ని నాశనం చేస్తాను. మీరు దానికి భయపడితే అది మిమ్మల్నీ భయపెడుతుంది. హర్ హర్ మహాదేవ్ అంటూ పేర్కొంది. ఇదిలా ఉంటే కంగనా పైన కోల్ కత్తాలో కేసు నమోదైంది. సోషల్ మీడియా ద్వారా మత విద్వేషాలను రెచ్చిగోట్టిందనే ఆరోపణలపైన కంగనా పైన కేసు నమోదైంది. తృణముల్ కాంగ్రెస్ ప్రతినిధి రిజు దత్తా చేసిన ఫిర్యాదుతో కోల్ కత్తాలో పోలీసులు కేసు ఫైల్ చేశారు. పోలీసులు ఐపీసీతో పాటు, ఐటీ సెక్షన్ లపైన కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే కంగనా అకౌంట్ ని సస్పెండ్ చేసింది ట్విట్టర్.

Tags

Read MoreRead Less
Next Story