రెండో పెళ్లి చేసుకున్న రాఘవేంద్ర రావు మాజీ కోడలు !

Kanika Dhillon second marriage : గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న బాలీవుడ్ స్క్రీన్ రైటర్లు కనికా ధిల్లాన్, హిమాన్షు శర్మ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అతి కొద్ది మంది సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఈ సందర్భంగా కనికా తన భర్తతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. సినీ తారలు, అభిమానులు వారికి పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం కనికా ధిల్లాన్, హిమాన్షు శర్మ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కనికా ధిల్లాన్ ఎవరో కాదు.. టాలీవుడ్ దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్ కోవెలమూడి మొదటి భార్య.. వివాహం అనంతరం ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో.. వివాహం జరిగిన రెండేళ్ళకే విడాకులు తీసుకున్నారు. రియల్ లైఫ్ లో విడిపోయినప్పటికి.. రీల్ లైఫ్ లో మాత్రం కలిసే పనిచేశారు.
కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన 'జడ్జిమెంటల్ హై క్యా' చిత్రానికి ప్రకాష్ దర్శకత్వం వహించగా, కనికా కథను అందించారు. విడాకుల అనంతరం బాలీవుడ్ స్క్రీన్ రైటర్ హిమాన్షు శర్మతో ప్రేమలో పడింది కనిక. ఇప్పుడు ఈయన్నే రెండో వివాహం చేసుకున్నారు కనిక.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com