Aryan Khan : ఆర్యన్ ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా..!

Aryan Khan : ఆర్యన్ ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా..!
Aryan Khan : ముంబై క్రూయిజ్‌ నౌకలో డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయిన్ ఆర్యన్ ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది.

Aryan Khan : ముంబై క్రూయిజ్‌ నౌకలో డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయిన్ ఆర్యన్ ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. మంగళవారం సుధీర్ఘ వాదనలు విన్న బాంబే హైకోర్టు.. బుధవారానికి వాయిదా వేసింది. తొలుత ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ ఇవ్వకూడదని ఎన్సీబీ వాదించింది. ఆర్యన్‌కు బెయిల్ వస్తే సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశాలున్నాయని కోర్టుకు తెలిపింది. డ్రగ్స్ కేసుకు సంబంధించి షారుఖ్ ఖాన్ మేనేజర్ సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారని ఎన్సీబీ ఆరోపించింది. విచారణ జరుగుతున్న సమయంలోనే ప్రత్యక్ష సాక్ష్యులతో మాట్లాడి కేసును తప్పుదోవ పట్టించినట్లు చూశారని కోర్టుకు తెలిపింది. డ్రగ్స్ కేసుకు సంబంధించి ఆర్యన్‌ను విచారిస్తే మరిన్ని విషయాలు బయటికొస్తాయని ఎన్సీబీ వాదించింది.

ఎన్సీబీ వాదనలపై ఆర్యన్ ఖాన్ తరుపు న్యాయవాది మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ అభ్యంతరం వ్యక్తం చేశారు. సుదీర్ఘంగా కొనసాగిన వాదనల సందర్భంగా పలు కీలక అంశాలను రోహత్గీ, సతీశ్‌ మానెశిందే వాదనలు వినిపించారు. ప్రస్తావించారు. ఆర్యన్ అమాయకుడని, కుట్ర పూరితంగానే ఆర్యన్‌ను ఎన్‌సీబీ అధికారులు ఈ కేసులో ఇరికించారన్నారు. షిప్‌లో ఆర్యన్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేకున్నా 20 రోజులకు పైగా జైలులో ఉంచారన్నారు. ఆర్యన్‌కు డ్రగ్ టెస్ట్ కూడా నిర్వహించలేదని, ఫోన్‌లోని చాట్‌ 2018లో జరిపినవిగా రోహత్గీ కోర్టుకు తెలిపారు. అతడి వయస్సును దృష్టిలో ఉంచుకొని ఆర్యన్‌కు బెయిల్‌ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు.

సుధీర్ఘంగా సాగిన విచారణలో రెండు వైపులా వాదనలు విన్న కోర్టు.. విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో సహ నిందితులుగా ఉన్న అర్బాజ్‌ మర్చంట్‌, మూన్‌మూన్‌ ధమేచాల బెయిల్‌ పిటిషన్‌పైనా బుధవారం విచారించనున్నట్టు ధర్మాసనం తెలిపింది. ఇక.. 27న సాగే విచారణలో ఎన్‌సీబీ తరఫున అడిషినల్‌ సొలిసిటర్‌ జనరల్‌ అనిల్‌ సింగ్‌ కూడా తన వాదనలు వినిపించనున్నారు. ఇక.. ఆర్యన్‌ ఖాన్‌ విడుదలకు ఎన్సీబీ అధికారి 25 కోట్లు షారూఖ్‌ను డిమాండ్‌ చేశారని ప్రత్యక్ష సాక్షి ప్రభాకర్‌ సెయిన్‌ చేసిన సంచలన ఆరోపణలు చల్లారడం లేదు. దీనికి బలం చేకూర్చేలా శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌, మహారాష్ట్ర మంత్రులు ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అయితే ఈ ఆరోపణలపై ఎన్సీబీ కోర్టును ఆశ్రయించగా.. ఆ సంస్థ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే సైతం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఇదంతా దర్యాప్తునకు ఆటంకం కలిగించేందుకు చేసే కుట్రలని సమీర్‌ వాంఖడే అన్నారు. తాము నిస్పాక్షికంగా విచారణ చేశామన్న ఆయన.. తాను ఎలాంటి దర్యాప్తుకైనా సిద్ధమని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. మరి.. ఆర్యన్ ఖాన్‌కు బుధవారం బెయిల్ వస్తుందా.. లేదా..? దేశంలో సంచలనం సృష్టించిన ఈ డ్రగ్స్ కేసు ఇంకెన్ని మలుపులు తీసుకుంటాయనేది వేచి చూడాలి.

Tags

Next Story