Aryan Khan Bail : ఆర్యన్‌ ఖాన్‌కు ఊరట.. బెయిల్‌ మంజూరు చేసిన బాంబే హైకోర్టు

Aryan Khan Bail (tv5news.in)
X

Aryan Khan Bail (tv5news.in)

Aryan Khan Bail : ముంబై క్రూజ్‌ డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌ ఖాన్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. అతనికి బాంబే హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

Aryan Khan Bail : ముంబై క్రూజ్‌ డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌ ఖాన్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. అతనికి బాంబే హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అర్యన్‌తో పాటు మరో ఇద్దరికి బెయిల్‌ మంజూరైంది. ఆర్యన్‌ బెయిల్‌ పై బాంబే హైకోర్టులో మూడు రోజుల పాటు సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఆర్యన్‌ తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. చివరకు బెయిల్‌ మంజూరు చేస్తూ బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన 23 రోజుల తర్వాత ఆర్యన్‌ కు బెయిల్‌ లభించనట్టయింది. ఇంతకుముందు రెండుసార్లు అతని బెయిల్‌ను ప్రత్యేక న్యాయస్థానం నిరాకరించింది. ప్రస్తుతం ముంబైలోని ఆర్ధర్‌ జైలులో ఉన్న ఆర్యన్‌ ఖాన్‌... రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.

Tags

Next Story