Thank God : అజయ్ దేవగన్ 'థాంక్ గాడ్' చిత్రంపై కేసు..

Thank God : అజయ్ దేవ్‌గన్ థాంక్ గాడ్ ట్రైలర్ రిలీజ్ అయిన కొన్ని నిమిశాషాలకే వివాదం సృష్టించింది. ట్రైలర్‌లో చిత్రగుప్తుడిని అవమానించారంటూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన న్యాయవాది శ్రీ వాస్తవ కేసు పెట్టారు. మతవిశ్వాసాలను అవమానించారని పిటిశన్‌లో పేర్కొన్నారు. కామెడీ ఫ్యాంటసీ చిత్రం 'థాంక్ గాడ్'. సిద్ధార్ధ్ మల్హోత్రా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో అజయ్ దేవగణ్ చిత్రగుప్తిడి పాత్రలో కనిపిస్తారు.
హీరో చనిపోయిన తరువాత చిత్రగుప్తుడు ప్రత్యక్షమవుతాడు. హీరోకు చిత్రగుప్తుడిగా మధ్య సంభాషన ఆసక్తిగా సాగుతుంది. ఇంద్రకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 9న రిలీజ్ అయిన ఈ ట్రైలర్ ఇప్పటికే 3 కోట్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. దివాళి పండగ సందర్భంగా అక్టోబర్ 25న చిత్రాన్ని రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నద్ధమవుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com