Cinema: ఆమె ఆ సినిమాకు నో చెప్పింది అందుకే....!

Cinema: ఆమె ఆ సినిమాకు నో చెప్పింది అందుకే....!
మీటూ వివాదంలో డైరెక్టర్; అందుకే ఆ సినిమాలో నటించేందుకు దీపిక నో...
తూ జూఠీ మే మక్కర్ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ దెబ్బకు ఇటు రణ్ బీర్ కపూర్ తోపాటూ అటు శ్రద్ధాకపూర్ ఖాతాలోనూ భారీ హిట్ పడింది. అయితే ఈ హిట్ ను దీపికా పదుకోనే కావాలని మిస్ చేసుకుందని తెలుస్తోంది. నిజమే తొలుత రణ్ బీర్ కు జోడీగా శ్రద్ధా బదులు దీపికనే అనుకున్నారు. ఆమె కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కానీ, ఈ వార్త బయటకు వస్తూనే దీపిక అభిమానులు గగ్గోలు పెట్టేశారు. మీటూ వివాదంలో తూ జూఠీ మైఁ మక్కర్ దర్శకుడు లవ్ రంజర్ పేరు ప్రముఖంగా వినబడింది. అలాంటి అతడి సినిమాలో నటించవద్దంటూ దీపిక భిమానులు నెత్తీ నోరూ కొట్టుకున్నారు. మరి వారి అభిప్రాయాన్ని గౌరవించాలనుకుందో ఏమో...దీపిక ఆ సినిమాకు నో చెప్పేసింది. అలా శ్రద్ధా కపూర్ వచ్చి చేరింది. ఏమైనా ఓ మంచి స్టాండ్ దీసుకున్నందుకు అభిమానులు తెగ మురిసిపోతన్నారు.

Tags

Read MoreRead Less
Next Story