Cinema: ఫైటర్ లో దీపిక పైలెట్ అంట

Cinema: ఫైటర్ లో దీపిక పైలెట్ అంట
ఫైటర్ సినిమా గురించి చెప్పుకొచ్చిన సిద్ధార్ధ్ ఆనంద్; దీపికనే అసలైన ఫైటర్ అంటూ....

ఆస్కార్ కు వ్యాఖ్యాతగా అందిపుచ్చుకున్న అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్న దీపికా పదుకోనే మళ్లీ పనిలో పడిపోయింది. ప్రస్తుతం సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమాల ో నటిస్తోంది. ఈ చిత్రంల ో దీపికకు జోడీగా హృతిక్ రోషన్ కనిపించబోతున్నాడు. వీరిద్దరూ తొలిసారి హీరోహీరోయిన్లుగా నటించబోతున్నారు. ఇటీవలే ఫైటర్ కాశ్మీర్ లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇక సినిమా గురించి చెబుతూ డైరెక్టర్ సిద్ధార్ద్ ఆనంద్ దీపిక పాత్ర గురించి కొన్ని కీలకమైన విషయాలు చెప్పుకొచ్చాడు. ఎయిర్ ఫోర్స్ టీమ్ లో కీలకమైన సభ్యురాలిగా, ఫైటర్ పైలట్ గా దీపిక ఓ పవర్ ఫుల్ వుమెన్ ఆఫీసర్ గా కనిపించబోతోందని తెగ ఊరించేస్తున్నాడు. ఈ సినిమాల ో దీపిక పాత్ర ఆమె రియల్ లైఫ్ క్యారెక్టర్ కు చాలా దగ్గరగా ఉంటుందని వివరించాడు. ఇంతకు ముందేన్నడూ దీపికను చూడని అవతారంలో ఫైటర్ లో కనిపిస్తుందని చెప్పాడు. అంతేకాదు ఆమె పాత్ర హృతిక్ పాత్రకు హేమాహేమీ అనే రేంజ్ లో ఉంటుందని తెగ మురిపించేస్తున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story