Cinema: ఛత్రపతిగా వచ్చేస్తోన్న బెల్లంకొండ

Cinema: ఛత్రపతిగా వచ్చేస్తోన్న బెల్లంకొండ
సాయి శ్రీనివాస్ హీరోగా హిందలో రీమేక్ అవుతోన్న రాజమౌళి ఛత్రపతి; ఫస్ట్ లుక్ విడుదల

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఛత్రపతి సినిమా హిందీలో రీమేక్ అవుతోన్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన ఈ చిత్రం తెలుగులో విజయఢంగా మోగించింది. సుమారు దశాబ్దం క్రితం వచ్చిన ఈ బ్లాక్ బస్టర్ ను హిందీ రీమేక్ చేసేందుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ముందుకు రాగా డైనమిక్ డైరెక్టర్ వీవీ వినాయక్ ఇందుకు మెగా ఫోన్ బాధ్యతలు స్వీకరించారు. బాలీవుడ్ హీరోయిన్ నుస్రత్ బరూచా హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. పలకల దేహంతో కనిపిస్తోన్న బెల్లంకొండ ఈ సినిమా కోసం ఎంతగా కష్టపడుతున్నాడో పోస్టర్ చూస్తేనే అర్థమవుతోంది. మరి ఫస్ట్ లుక్ తోనే అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్న సాయి శ్రీనివాస్, ఈ దెబ్బతో బాలీవుడ్ లో పాగా వేస్తాడేమో చూడాలి.



Tags

Read MoreRead Less
Next Story