Cinema: సల్మాన్ వెంకీ మధ్యలో చెర్రీ....

Cinema: సల్మాన్ వెంకీ మధ్యలో చెర్రీ....
కిసీకా భాయ్ కిసీకా జాన్ సినిమాలో రామ్ చరణ్ స్పెషల్ ఎంట్రీ....

బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ తాజా మూవీ కిసీకా భాయ్ కిసీకా జాన్ టాలీవుడ్ బాక్సాఫీస్ ను కూడా షేక్ చేసేట్టే కనిపిస్తోంది. సల్మాన్ ఖాన్ స్టార్ డమ్ కు విక్టరీ వెంకటేశ్ మాస్ ఫాలోయింగ్ తో పాటూ పూజా హెగ్డే అంద చందాలు కూడా తోడవ్వడంతో సినిమా సూపర్ సక్సెస్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన యెంతమ్మ సాంగ్ చిన్నా పెద్ద తేేడా లేకుండా అందరినీ ఉర్రూతలూగించేట్టే కనిపిస్తోంది. ఇక ఈ పాటలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్పెషల్ ఎంట్రీ మరో రేంజ్ అని చెప్పాల్సిందే. పచ్చ చొక్కా, తెల్ల లుంగీలో వెంకిమామ, సల్లూమియా, చెర్రీ అదిరిపోయే స్టెప్పులు వేసి అదరగొట్టేశారనే చెప్పాలి. ఇక పూజా పాప సైతం లుంగీలో స్టెప్స్ వేసి కెవ్వు కేక అనిపించేసింది. మరి పాటలతో మురిపించేస్తున్న కిసీకా భాయ్ కిసీకా జాన్ ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఉర్రూతలూగిస్తుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story