బాలీవుడ్‌ నటీనటులను వెంటాడుతున్న కరోనా వైరస్..!

బాలీవుడ్‌ నటీనటులను వెంటాడుతున్న కరోనా వైరస్..!
బాలీవుడ్‌ను కరోనా వణికిస్తోంది. వరుసగా నటులు వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ నటీనటులు ఆలియాభట్, రణ్‌బీర్ కపూర్, మాధవన్, ఆమీర్ ఖాన్ వంటి నటులు కొవిడ్ బారిన పడ్డారు.

బాలీవుడ్‌ను కరోనా వణికిస్తోంది. వరుసగా నటులు వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ నటీనటులు ఆలియాభట్, రణ్‌బీర్ కపూర్, మాధవన్, ఆమీర్ ఖాన్ వంటి నటులు కొవిడ్ బారిన పడ్డారు. తాజాగా బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్, నటుడు గోవిందాకు కరోనా వైరస్ సోకింది. గోవిందాకు క‌రోనా సోకినట్లు అత‌ని భార్య సునిత తెలిపారు. అత‌నికి స్వల్ప ల‌క్షణాలు ఉన్నాయని.. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లోనే ఉన్నారని చెప్పారు. త‌న‌తోపాటు ఇత‌ర కుటుంబ స‌భ్యులు, సిబ్బందికి మాత్రం నెగ‌టివ్‌గా తేలిన‌ట్లు సునిత తెలిపారు.

ఇక నటుడు అక్షయ్ కుమార్ కొవిడ్ బారిన పడ్డాడు. సోషల్ మీడియాలో ద్వారా ఈ విషయాన్ని తెలిపాడు. పరీక్ష చేస్తే.. కరోనా పాజిటివ్ వచ్చిందని ట్వీట్ చేశారు. అన్ని ప్రోటోకాల్‌లను అనుసరించి, వైద్యుల సూచన మేరకు హోం ఐసోలేషన్‌లో ఉన్నానని తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. తగిన జాగ్రత్తలు తీసుకొని త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తానని అక్షయ్ ట్వీట్ చేశారు.

అటు IPL 2021 ప్రారంభానికి ముందు కరోనా కలకలం సృష్టిస్తోంది. కీలక ఆటగాళ్ళకు కరోనా సోకుతుండటంతో ఫ్రాంచైజీల్లో ఆందోళన మెుదలైంది. ఇప్పటివరకు ముగ్గురు క్రికెటర్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా బెంగళూర్ జట్టు ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ కరోనా బారిన పడ్డారు. ఈనెల 9న ఆర్సీబీ తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్‌తో ఆడాల్సి ఉంది. అయితే ఆర్సీబీ ఆడే తొలి రెండు మ్యాచ్‌లకు పడిక్కల్ దూరం కానున్నాడని తెలుస్తోంది. పడిక్కల్ అందుబాటులో లేకపోవడం ఒక రకంగా ఆర్సీబీకి ఎదురుదెబ్బే అని చెప్పాలి.

Tags

Next Story