'జవాన్' నుంచి క్రేజీ అప్ డేట్.. స్టైలిష్ లుక్ లో విజయ్ సేతుపతి

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ లేటెస్ట్ మూవీ 'జవాన్' పై భారీ అంచనాలు నెలకొన్నాయి, నాలుగేళ్ల తర్వాత 'పఠాన్' తో బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన షారుఖ్.. ఇప్పుడు మరో భారీ బడ్జెట్ మూవీతో అలరించేందుకు సిద్ధమయ్యాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ రివీల్ అయింది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీలో ఆయన క్యారెక్టర్ ను రివీల్ చేశారు మేకర్స్. DEALER OF DEATH క్యాప్షన్‌తో విజయ్ సేతుపతి మాస్ లుక్ షేర్ చేశారు.
ఈ లుక్ లో విజయ్ సేతుపతి బ్లాక్ గాగుల్స్ ధరించి, స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇక రైట్ కార్నర్ సైడ్ లో అతని ఫుల్ పిక్ ను షేర్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టైటిల్ అనౌన్స్‌మెంట టీజర్‌తోపాటు 'Jawan Prevue'.. సినిమాపై ఇంతకుముందున్న అంచనాలను మరింత పెంచేస్తున్నాయి. గత కొన్ని రోజుల క్రితమే రిలీజైన 'జవాన్' ట్రైలర్‌లో షారుక్ ఖాన్ కిల్లింగ్ యాక్టింగ్‌తో ఇరగదీయబోతున్నాడని, ఇంటెన్స్ యాక్షన్ పార్టు, స్టన్నింగ్ విజువల్స్‌తో సాగే Prevue చెబుతోంది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో షారుఖ్ ఖాన్ ఈ చిత్రంలో తండ్రి, కొడుకుగా డ్యుయల్ రోల్‌లో కనిపించబోతున్నట్టు సమాచారం.
మోస్ట్ ఎవేటెడ్ మూవీగా రాబోతున్న జవాన్ సినిమాకు దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా నటించనున్నట్టు తెలుస్తోంది. ఆమెతో పాటు ఈ సినిమాలో హీరోయిన్ ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇక బాలీవుడ్ భామ దీపికా పదుకొనే కూడా అతిథి పాత్రలో కనిపించనుంది. జవాన్ సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ మూవీ.. హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతోంది. కాగా ఈ మూవీని షారుఖ్ ఖాన్ హోంబ్యానర్ రెడీ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గౌరీఖాన్ తెరకెక్కిస్తోంది.
'పఠాన్' తో భారీ విజయాన్ని మూటగట్టుకున్న షారుఖ్ ఖాన్.. ఈ సినిమాతో మరోసారి బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తాడని ఆయన ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అంతే కాదు ఈ సినిమా షారుఖ్ కు మరో వెయ్యి కోట్ల సినిమా అంటూ ముందే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్యాచ్ వర్క్ పూర్తి చేసుకుంటుండగా.. ఇప్పటికే ఈ సినిమాకు మూడొందల కోట్ల ప్రాఫిట్స్ వచ్చినట్లు ఇన్‌సైడ్ టాక్. థియేట్రికల్ రైట్స్ అన్ని ఏరియాలు కలుపుకుని రూ.312 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇక నాన్-థియేట్రికల్ హక్కులకు సుమారు రూ.250 కోట్లకు డీల్ కుదిరిందని సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com