Dabbo Ratnani: లక్కీ సామ్...

Dabbo Ratnani: లక్కీ సామ్...
డబ్బూ రత్నానీ క్యాలెండర్ గర్ల్ గా సమంత; దక్షిణాది నుంచి తొలి భామ....

క్రేజీ ఆఫర్లు అందిపుచ్చుకుంటూ దూసుకుపోతున్న సమంత తాజాగా ఓ క్యాలెండర్ పై తళుక్కుమనే ఛాన్స్ కొట్టేసింది. హాలీవుడ్ రేంజ్ సినిమాలు చేస్తున్న సామ్ కు క్యాలెండర్ ఓ లెక్కా అని మరీ తీసిపారేయకండి. అది అషామాషీ క్యాలెండర్ కాదు మరి. బాలీవుడ్ లీడింగ్ లేడీస్ సైతం ఒక్క ఛాన్స్ కోసం వెయిట్ చేసే డబ్బూ రత్నానీ క్యాలెండర్ షూట్ మరి. ఎంత పెద్ద హీరోయిన్లు అయినా రత్నానీ లెన్స్ నుంచి కనిపించాలని తాపత్రయపడుతుంటారు. అయితే ఇప్పటివరకూ దక్షిణాది భామలు ఈ క్యాలెండర్ కనిపించిన దాఖలాలు అరుదనే చెప్పాలి. తాజాగా ఆ లక్కీ ఛాన్స్ ను సమంత అందిపుచ్చుకుందట. ఇదే విషయాన్ని అమ్మడు తన ఇన్స్టా హ్యాండిల్ ద్వారా తెలియజేసింది. ఏమైనా సామ్ ఇదే విధంగా మరింత ముందుకు దూసుకుపోవాలని ఆశిద్దాం.

Tags

Read MoreRead Less
Next Story