Deepika Birthday: ఈ ఏడాది నెల తప్పే ప్లాన్ ఉందా.?

Deepika Birthday: ఈ ఏడాది నెల తప్పే ప్లాన్ ఉందా.?
నేటితో దీపికకు 37 ఏళ్లు: బేషరమ్‌ పాటకు సెన్సార్‌ గ్రీన్‌సిగ్నల్‌

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె నేటితో 37వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. తన భర్త రణ్‌వీర్‌తో ఈ భామ ఇప్పుడు తన బర్త్‌డే వెకేషన్‌ను ఎంజాయ్‌ చేస్తోంది. ఈ సందర్భంగా అమ్మడి అభిమానులు సోషల్‌ మీడియాలో తెగ పోస్టులు షేర్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాను రణ్ వీర్‌ను పెళ్లాడి నాలుగేళ్లకుపైనే అయినా ఇంకా పిల్లల్ని కనడం లేదనే వార్త తెగ వైరల్ అవుతుంది. నిన్న కాక మోన్న పెళ్లైన సోనమ్‌ కపూర్‌, అలియా భట్‌లు కూడా ఆ విషయంలో ముందుండటంతో దీపికా రణ్‌వీర్‌ దంపతుల విషయం బాలీవుడ్‌లో హాట్‌న్యూస్‌గా మారింది.


ఏదేమైనా ఈ ఏడాదైనా దీపికా నెలతప్పుతుందా లేదా అని ఆవిడ అభిమానులు ఎదురు చూస్తున్నారు. పిల్లల విషయంలో ఈ జంట మాత్రం చాల స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తుంది. తనతో పాటు రణ్‌వీర్‌కు కూడా పిల్లలంటే ఇష్టమేనని కానీ వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నట్లు చెబుతున్నారు. తనకు పుట్టబోయే బిడ్డలు కూడా తనలాగే పెరగాలని అందుకే సినిమాకు బ్రేక్ ఇచ్చిన తరువాతే పిల్లలు అని దీపిక చెప్పకనే చెప్పింది.

ఇదిలా ఉండగా ఈ నెల 25వ తేదీన విడుదల కాబోతున్న షారుఖ్‌ సినిమా పఠాన్‌ లో దీపీకానే కథానాయిక భూమిక పోషిస్తుంది. ఇటీవలే ఆ సినిమా బృందం విడుదల చేసిన బేషరమ్‌ అనే పాట వివాదస్పదంగా మారింది. ఈ పాటలో దీపికా కాషాయ రంగు బికిని ధరించింది. దీంతో బికిని సైజ్‌ చాలా చిన్నగా ఉందని చూడలేని రీతిలో ఉందని కమలనాథులు తెగ గోల చేసేస్తున్నారు. సెన్సార్‌బోర్డ్‌ తప్పకుండా ఆ సన్నివేశాన్ని తొలగించాలని డిమాండ్‌ కూడా చేశారు. దీంతో సెన్సార్‌బోర్డ్‌ వాళ్లు ఇప్పటికే ఈ సినిమాలో 10 చోట్ల కట్‌ చేశామని దీనిని కట్‌ చేయాల్సిన పనిలేదని తెలిపింది. దీంతో ఆ సినిమాలో ఈ సన్నివేశాన్ని తొలగించకుండానే విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో జాన్‌ అబ్రహమ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే మరో సన్నివేశంలో బాలీవుడ్‌ బ్రహ్మచారి సల్మాన్‌ ఖాన్‌ కూడా కనపడనున్నారు. నాలుగేళ్ల తరువాత మళ్లీ తెరపై కనపడనున్న షారుఖ్‌ ఖాన్‌కు ఈ సినిమా హిట్‌ ఇస్తుందో లేదో చూడాలి మరీ..

Tags

Read MoreRead Less
Next Story