Deepika Padukone: హాటే కాదు... చాలా స్వీట్ కూడా...

Deepika Padukone: హాటే కాదు... చాలా స్వీట్ కూడా...
దీపిక పై ప్రసంశలు కురిపిస్తోన్న అభిమాని; ఇంత స్వీట్ హీరోయిన్ అంటూ ట్వీటులు...
పఠాన్ సూపర్ సక్సెస్ అందుకోవడంతో దీపికా పదుకోనే గాల్లో తేలిపోతుంది అనుకుంటే... అమ్మడు చక్కగా ఎకానమీ క్లాస్ లో ఫ్లైట్ జర్నీ ఎంజాయ్ చేస్తోంది. సాధారణంగా బాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ బిజినెస్ క్లాస్ లోనే ప్రయాణిస్తారు. దశాబ్ది కాలంగా స్టార్ స్టేటస్ నే ఎంజాయ్ చేస్తున్న దీపిక ఇలా ఎకానమీ క్లాస్ లో, అది కూడా ఏ హడావిడి లేకుండా ప్రయాణించడం వెనుక మర్మమేమిటో తెలియరాలేదు. అయితే ఆమెను ఇలా ఎకానమీ క్లాస్ లో చూసిన అభిమానులు మాత్రం ఉబ్బితబ్బిబైపోయారు. ఇక మరోవైపు పనిలో భాగంగా లాస్ ఏంజెలెస్ కు చేరుకున్న దీపిక లాంగ్ ఫ్లైట్ జర్నీ చేశాక కూడా అక్కడ అభిమానులతో కాసేపు ముచ్చటించిదట. భారత్ కు చెందిన ఓ అభిమాని తన తల్లి కోసం దీపికను సెల్ఫీ అడగ్గా ఆమె వెంటనే అంగీకరించి ఆ వారి ముచ్చట తీర్చిందట. ఇక ఈ విషయాన్ని సదరు అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నాడు. దీపిక ఎంత మంచిదోనంటూ తెగ మురిసిపోతున్నాడు. అంత దూరం ప్రయాణించిన తరువాత కూడా ముఖంలో ఏమాత్రం విసుగు కనిపించకుండా ఆమె అభిమానుల పట్ల వ్యవహరించిన తీరుకు అతడు ముగ్ధుడైపోయాడు. సెల్ఫీ మాత్రమే కాకుండా, వారితో కాసేపు మాట్లాడి, జాగ్రత్తగా వెళ్లి రండి అంటూ బై కూడా చెప్పిందని తెగ మురిసిపోతున్నాడు. ఏమైనా ఎదిగిన కొద్ది ఒదిగి ఉండాలన్న దీపిక తీరుకు నెటిజెన్లే కాదు, అందరూ ఫిదా అయిపోయారనే చెప్పాలి.

Tags

Read MoreRead Less
Next Story