బాలీవుడ్

దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం దక్కింది. వెరైటీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఇంపాక్ట్ రిపోర్ట్-2021 లో ఆమె చోటు దక్కించుకుంది.

దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం
X

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం దక్కింది. వెరైటీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఇంపాక్ట్ రిపోర్ట్-2021 లో ఆమె చోటు దక్కించుకుంది. సినిమాకు ఆమె చేసిన కృషి, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నందుకుగానూ ఈ ప్రత్యేక గుర్తింపు లభించింది. దీనిపై స్పందించిన దీపికా చాలా గర్వంగా ఉందని తెలిపింది. ఆమె 'లైవ్ లాఫ్ లవ్' ఫౌండేషన్ ద్వారా మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించింది. సామాజిక సమస్యల గురించి సినిమాలు తీస్తోంది. ప్రస్తుతం దీపికా పదుకొణె తన భర్తతో రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి '83'లో నటిస్తోంది. ఈ ఏడాది జూన్‌ 4న సినిమా విడుదల కానుంది.


Next Story

RELATED STORIES