Ranveer Singh: రణవీర్ న్యూడ్ ఫోటోషూట్.. స్పందించిన దీపికా..

Ranveer Singh: ఈమధ్యకాలంలో హీరోయిన్లు మాత్రమే కాదు హీరోలు కూడా వింత వింత ఫోటోషూట్స్‌తో షాకిస్తున్నారు. వెరైటీ దుస్తులతో, కొత్త ఫ్యాషన్ స్టైల్స్‌తో దర్శనమిస్తున్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన బాలీవుడ్ హీరో పేరు రణవీర్ సింగ్. రణవీర్ సింగ్ స్టైలే వేరు. తను ఎవరి స్టైల్‌ను ఫాలో అవ్వడు. తనకంటూ ఒక కొత్త మార్క్‌ను క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. ఇక తాజాగా రణవీర్ చేసిన న్యూడ్ ఫోటోషూట్ సోషల్ మీడియానే షేక్ చేసింది.
ఒక మ్యాగజిన్ కవర్ పేజీ కోసం రణవీర్ తన ఒంటి మీద దుస్తులు లేకుండా ఫోటోషూట్ చేశాడు. కొన్ని ఫోటోల్లో లోదుస్తులు మాత్రమే ధరించి కనిపించాడు. ఇటీవల రణవీర్ ఈ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. కొన్ని గంటల్లోనే ఆ పోస్ట్‌కు లక్షల్లో లైకులు, కామెంట్లు వచ్చి పడ్డాయి. దీని వల్ల కొందరు తనను ట్రోల్ చేస్తుండగా.. కొందరు మాత్రం రణవీర్ స్టైలే సెపరేటు అనుకుంటున్నాను. ఎందరో బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం తన పోస్ట్‌పై కామెంట్ల వర్షం కురిపించారు.
దీపికా పదుకొనె కూడా రణవీర్ సింగ్ న్యూడ్ ఫోటోషూట్‌పై స్పందించింది. ఈ ఫోటోలు ఇంటర్నెంట్‌లో వైరల్ అవ్వకముందే దీపికా వాటిని చూసిందని సన్నిహితులు చెప్తున్నారు. తనకు ఆ ఫోటోలు బాగా నచ్చాయని వారు అంటున్నారు. అంతే కాకుండా రణవీర్ ఏం చేసినా.. దీపికా సపోర్ట్ చేస్తుందని వారి జంటను ప్రశంసిస్తున్నారు. ఎంతైనా రణవీర్, దీపికా బాలీవుడ్‌లోని క్యూట్ కపుల్స్‌లో ఒకరు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com