హీరోయిన్‌‌‌‌‌‌‌‌ను చుట్టుముట్టిన ఫ్యాన్స్‌ .. ఇంతలో బ్యాగు లాగేసుకొని..!

హీరోయిన్‌‌‌‌‌‌‌‌ను చుట్టుముట్టిన ఫ్యాన్స్‌ .. ఇంతలో బ్యాగు లాగేసుకొని..!
సేల్ఫీలని, ఆటోగ్రాఫ్ లని నానా హంగామా చేస్తారు. వారిని దాటుకొని కారెక్కడం వరుకు సెలబ్రిటీలకి కాస్తా ఇబ్బందిగానే ఉంటుంది.

తమ అభిమాన నటీనటులు కనిపిస్తే చాలు వారిని అభిమానులు చుట్టుముడుతారు. సేల్ఫీలని, ఆటోగ్రాఫ్ లని నానా హంగామా చేస్తారు. వారిని దాటుకొని కారెక్కడం వరుకు సెలబ్రిటీలకి కాస్తా ఇబ్బందిగానే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా బయట తినడానికి వెళ్లిన బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణెకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది.

ముంబైలోని ఓ రెస్టారెంట్‌ కి విందు కోసం వెళ్ళింది దీపికా.. అక్కడ తిని తిరిగి వెళ్తుండగా... అక్కడున్నవారంతా ఆమెను చుట్టుముట్టారు. వారి మధ్య నుంచి దీపిక ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వెళ్తుండగా.. ఓ అభిమాని దీపిక హ్యాండ్‌బ్యాంగును పట్టుకు లాగింది.. దీనితో ఒక్కసారిగా షాకైన దీపిక తన హ్యాండ్‌బ్యాంగును వెనక్కి లాక్కుంది. అనంతరం కారులో వెళ్లి కూర్చోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Tags

Read MoreRead Less
Next Story