డ్రగ్స్ కేసు : తెరపైకి నటి దియా మీర్జా పేరు

డ్రగ్స్ కేసు : తెరపైకి నటి దియా మీర్జా పేరు

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి సంబంధించి.. ప్రస్తుతం డ్రగ్స్ కేసు దర్యాప్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఎన్‌సిబి ఇప్పటివరకు 12 మందికి పైగా అరెస్టు చేసింది, ఇందులో నటి రియా చక్రవర్తి , ఆమె సోదరుడు షౌవిక్ చక్రవర్తి ఉన్నారు. దర్యాప్తు చేసే కొద్దీ ఈ కేసులో చాలా మంది సినీ తారల పేర్లు బయటకు వస్తున్నాయి. తాజాగా నటి దియా మీర్జా పేరు కూడా తెరపైకి వచ్చింది. డ్రగ్స్ ప్యాడ్లర్ అనుజ్ కేశ్వానీ.. దియా మీర్జా పేరు బయటపెట్టారని ప్రచారం జరుగుతోంది. ఆమె మేనేజర్ డ్రగ్స్ కొనడానికి ప్రయత్నించారని, ఇందుకు సంబంధించి ఆధారాలు లభించడంతో..

విచారణ కోసం ఎన్‌సిబి త్వరలో దియా మీర్జాకు సమన్లు ​​పంపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా డ్రగ్స్ కేసులో ఇప్పటికే దీపికా పదుకొనే, సారా అలీ ఖాన్ సహా పలువురు నటీమణులు పేర్లు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. మాదకద్రవ్యాలు వాడారనే ఆరోపణలపై దర్యాప్తుకు సంబంధించి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) నటి దీపికా పదుకొనే మేనేజర్ కరిష్మా ప్రకాష్, టాలెంట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ సిఇఒ ధ్రువ్ లను విచారించడం కోసం నోటీసులు జారీ చేసింది.

Tags

Next Story