Tiger Shroff: టైగర్, దిశా బ్రేకప్ రూమర్స్.. సోషల్ మీడియాలో కపుల్ క్లారిటీ..

Tiger Shroff: సినీ పరిశ్రమలో బ్రేకప్, విడాకులు లాంటివి కామన్ అని ప్రేక్షకులు కూడా నమ్మడం మొదలుపెట్టారు. ఎంతోమంది క్యూట్ కపుల్స్ ప్రేమ తర్వాత పెళ్లి వరకు వెళ్లకుండా ఆగిపోయారు. పెళ్లి చేసుకున్న వారు కూడా కొంతకాలానికే విడాకుల పేరుతో విడిపోతున్నారు. దీనివల్లే ప్రేక్షకులు కూడా అలాగే ఫిక్స్ అయిపోయారు. ఇక తాజాగా బాలీవుడ్‌లో టైగర్ ష్రాఫ్, దిశా పటానీ బ్రేకప్ రూమర్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఇంతలోనే ఈ కపుల్ సోషల్ మీడియాతో ఓ క్లారిటీ ఇచ్చేసింది.
మోడల్ నుండి హీరోయిన్‌గా మారిన దిశా పటానీ.. తెలుగులో ఓ సినిమా చేసిన తర్వాత పూర్తిగా బాలీవుడ్‌కు చెక్కేసింది. హిందీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వకముందే టైగర్ ష్రాఫ్‌తో ఓ ప్రైవేట్ సాంగ్‌లో నటించింది. అప్పటినుండి వీరిద్దరి ప్రేమాయణం మొదలయ్యింది. ఆ తర్వాత కలిసి సినిమా కూడా చేశారు. ఇక ఆరేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న వీరిద్దరూ విడిపోయారంటూ బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
టైగర్ ష్రాఫ్, దిశా పటానీ కలిసి జిమ్‌కు వెళ్లేవారు. ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యేవి. టైగర్ ష్రాఫ్ చేసే చాలా స్టంట్స్ దిశాకు నేర్పించే వీడియోలు కూడా నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా టైగర్ ష్రాఫ్ ఓ వర్కవుట్ వీడియోను అప్‌లోడ్ చేశాడు. దానికి దిశా కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. 'నాకు కూడా చేయాలని ఉంది' అంటూ దిశా కామెంట్ చేసింది. దీనికి టైగర్ మాత్రం ఏ విధంగా స్పందించలేదు. అంటే టైగర్.. దిశాను వద్దనుకున్నా తను మాత్రం వద్దు అనుకోలేకపోతుందా అంటూ కొత్త అనుమానాలు మొదలయ్యాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com